రామభద్రపురం మండలం లో గ్రామ వాలంటీర్ పోస్ట్ లకు నోటిఫికేషన్

రామభద్రపురం మండలం లో గ్రామ వాలంటీర్ పోస్ట్ లకు నోటిఫికేషన్
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) రామభద్రపురం
రామభద్రపురం మండలం లో
ప్రస్తుతం ఖాళీగా ఉన్న 5 గ్రామ వాలంటీర్ పోస్ట్ లకు కులము, పంచాయతీ పేరు,
లింగము తెలిపే విధముగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అని ఎంపీడీఓ రమామణి
చెప్పారు, నాయుడువలస సచివాలయం లో నాయుడువలస లో ఒకటి (బీసీ డి) C7,
గొల్లపేట సచివాలయం లో సీతారాంపురం (బీసీ డి) C8, గొల్లపేట (బీసీ డి) C11
లో ఒక్కొక్కటి, రావివలస సచివాలయం లో రావివలస (ఎస్ టీ) C7 లో ఒకటి,
సోంపురం సచివాలయం లో సోంపురం (బీసీ ఏ) C6 లో ఒకటి మొత్తం ఐదు ఖాళీగా
ఉన్నాయని, ఫిబ్రవరి ఏడు నుండి పదకొండు వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు
స్వీకరిస్తామని, పన్నెండు వ తేదీన వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తామని,
పద్నాలుగు తేదీన ఎంపిక కాబడిన వాలంటీర్స్ సమాచారం ఇస్తామని, ఫిబ్రవరి
పదిహేను న ఎంపిక అయిన వలంటీర్లని నియమిస్తామని, ఇరవై తేదీ లోపు సి యఫ్
యమ్ ఎస్ ఐడి లు సృష్టించి సంబందించిన డీడీఓ లాగిన్ లో వలంటీర్లను జాయిన్
చేసుకొని ఆ క్లస్టర్ లో మాపింగ్ చేస్తామని ఎంపీడీఓ రమామణి సూచించారు.