రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ ను విస్మరించిన గోకవరం పంచాయతీ ఈవో టంకాల శ్రీనివాస్ !?

రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ ను విస్మరించిన గోకవరం పంచాయతీ ఈవో టంకాల శ్రీనివాస్
క్యాపిటల్ వాయిస్, గోకవరం :- భారత రాజ్యాంగం అమలులోనికి రావడానికి కారణమైన బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ను విస్మరించి నేటి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చేయడం ఆ మహానుభావుని అగౌరవ పరిచినట్టుగానే భావించాలి. భారతదేశానికి దిశ,దశా చూపించిన మహానుభావుడు అంబేద్కర్. మనిషి తన తల్లి గర్భంలో నుంచి బయటపడి పెద్ద ఎదిగి ఆఖరుకు కాటిలో కలిసే వరకు భారత రాజ్యాంగం అతనికి తోడుగానే ఉంటుంది. అటువంటి మహా గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను గోకవరం పంచాయతీ సెక్రెటరీ టంకాల. శ్రీనివాస్ విస్మరించడం చాలా దారుణమని ప్రజాస్వామ్యవాదుల మండిపడుతున్నారు. విషయానికొస్తే .. భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనవరి 26 న గోకవరం మండలం గోకవరం పంచాయతీ కార్యాలయంలో సెక్రెటరీ టంకాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈయన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ ఫోటో లేకుండా గణతంత్ర దినోత్సవం జరపడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు… ఈవొ టంకాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోకవరం పంచాయతీలో ఇలా జరగడం వరుసగా *ఇది నాలుగవసారి. ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వోద్యోగిగా అనేక ప్రాంతాల్లో సేవాలందించిన అధికారి ఎన్నో రిపబ్లిక్ డే లు నిర్వహించిన సెక్రటరీ గారికి ఈ సందర్భం తెలియక పోవడం శోచనీయం. గోకవరంలో ఎంతోమంది గ్రామ పెద్దలు, స్థితిమంతులు ఉన్నా, ఎలక్షన్ ద్వారాగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఈ సభలో వృత్తి రీత్యా పొరుగు ఊరు నుండి వచ్చిన టంకాల. శ్రీనివాస్ చే జెండా ఎగరవేయడం జరిగింది. ఇంత మంది ఉన్నా ఈ సభలో ఈవో శ్రీనివాస్ కు జండా ఎగరవేసే అవకాశం వచ్చిందంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కేనని పంచాయతీ సెక్రెటరీ కి తెలియదా అని రాజ్యాంగ స్ఫూర్తి ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి స్త్రీ మూర్తికి సమాన హక్కులు కల్పించి, స్త్రీలను సైతం చట్టసభలో కూర్చోబెట్టిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కే చెందుతుందని, పంచాయతీ స్వీపర్ దగ్గర నుండి డాక్టర్, పోలీస్, కలెక్టర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు అలాగే వార్డు మెంబర్ మొదలుకొని ఎమ్మెల్యే, మంత్రి, ప్రధాన మంత్రి, అత్యున్నత పీఠం రాష్ట్రపతి వరకు డా.బి. ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నియమించబడుతూ, చట్టాలు అమలవుతున్నాయని అటువంటి గొప్ప సంఘసంస్కర్త,మేధావి, అభ్యున్నతవాది,నవ భారత రాజ్యాంగ నిర్మాత ని మర్చిపోయారా లేక కావాలని పక్కన పెట్టారా అనిని ప్రజలలో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సాక్షాత్తు గోకవరం రెవిన్యూ కార్యాలయంలో స్థానిక ఎమ్మార్వో శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలను చూసైనా విధి విధానాలు తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.