AMARAVATHIAndhra Pradesh

రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు.. సీఎం, డీజీపీ కలిసి దాడి చేయించారు : చంద్రబాబు

రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదు.. సీఎం, డీజీపీ కలిసి దాడి చేయించారు : చంద్రబాబు

క్యాపిటల్ వాయిస్, అమరావతి :-  సీఎం, డీజీపీ కలిసి టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై దాడి చేయించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలను ఇప్పటివరకు చూడలేదంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్షంగా మాట్లాడితే స్టేట్ స్పాన్సర్ట్ టెర్రరిజంతో పోలుస్తూ అణిచివేస్తున్నారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామ్యమన్నారు. ఇది పులివెందుల రాజకీయం కాదని.. ఏపీ రాజకీయం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని చంద్రబాబు పేర్కొన్నారు. దాడులు చేసి చంపేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. డ్రగ్ మాఫియాకు ఏపీ కేంద్రంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థ బ్రష్టుపట్టి పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. రేపటి టీడీపీ బంద్‌కు ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!