AMARAVATHIAndhra Pradesh
రైతులకు శుభవార్త..! మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కింద వీటికి సబ్సిడీ

రైతులకు శుభవార్త..! మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కింద వీటికి సబ్సిడీ
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- రైతులు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థతో తక్కువ నీటితో ఎక్కువ పంటలను ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల నీటి పొదుపుతో పాటు పంటలకయ్యే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం చెరువుల నిర్మాణం, సోలార్ పంపులు, మినీ స్ప్రింక్లర్లు, డ్రిప్పుల నిర్మాణానికి భరోసా ఇస్తుంది. రైతు సంఘాలు ఈ స్కీంని ఉపయోగించుకొని సబ్సిడీ పొందాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. అంతేకాదు ఖర్చు నుంచి కూడా భారం తగ్గుతుంది.
ప్రయోజనం ఎలా పొందవచ్చు..
రైతులు వ్యక్తిగతంగా లేదా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది రైతులు కలిసి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వ్యక్తిగత రైతులకు వాటర్ ట్యాంక్ నిర్మాణంపై 70 శాతం, సోలార్ పంపుపై 75 శాతం, మినీ స్ప్రింక్లర్, డ్రిప్‌పై 85 శాతం సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా వాటర్ ట్యాంక్ నిర్మాణంపై రైతుల బృందానికి 85 శాతం, సోలార్ పంపుపై 75 శాతం, మినీ స్ప్రింక్లర్ లేదా డ్రిప్‌పై 85 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఒక్కసారి ఈ ప్రయోగం విజయవంతమైతే రైతులకు చాలా బాధలు తగ్గుతాయి.