Andhra PradeshVisakhapatnam
రాజకీయ ముసుగులో ముగిసిన చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు

రాజకీయ ముసుగులో ముగిసిన చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖ జిల్లా మధురవాడలో రాష్ట్రంలోనే ప్రప్రదమ స్దానం పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటి ఎన్నికలు ఎట్టకేలకు రాజకీయ నాయకుల రంగ ప్రవేశంతో అఖరికి రాజకీయంగా ముగిసాయి చైర్మన్ గా బుడుమూరి మీనా ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా , వైస్ చైర్మన్ కిలాని పోలినాయుడు, నొడగల భవాని పోటీ పడగా భవానీ కి 5 ఓట్లు పడగా కిలాని పోలినాయుడు 10 ఓట్లు తో ఎన్నికయ్యారు.రస వత్తరంగా ఎన్నికలు ముగిసిన తరువాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజబాబు చైర్మన్, వైస్ చైర్మణ్లను షాలువ కప్పి అభినందించారు. చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన బుడుమూరి మీనా ఒక దళిత మహిళ జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థి కావటం సభ్యులు దళిత కి అవకాశం ఇవ్వాలనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తరువాత ప్రధానోపాధ్యులు రాజబాబు మాట్లాడుతూ ఎన్నికలు కమిటీ సభ్యులకు పాఠశాల అభివృద్ధి కి సమిష్టిగా తోడ్పాటు ని అందించాలని కోరారు.
