Telangana
ప్రయివేటు టీచర్ ను దూషించిన డిఈఓ పై చర్యలు తీసుకోవాలి……..కలెక్టర్ కి ఫిర్యాదు

ప్రయివేటు టీచర్ ను దూషించి న డిఈఓ పై చర్యలు తీసుకోవాలి…….. కలెక్టర్ కి ఫిర్యాదు
క్యాపిటల్ వాయిస్(తెలంగాణ) మంచిర్యాల జిల్లా: ఇటీవల ఒక ప్రైవేటు టీచర్ యూనియన్ సభ్యుడు, ప్రభుత్వం సెలవులు ప్రకటించిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్నారని సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని సదరు నాయకుడు చరవాణిలో డిఈఓ కి తెలిపాడు. ఆ క్రమంలో ఆగ్రహానికి లోనైన డీఈవో హా చెప్పండి మీకైనా బుద్ధి ఉండాలి కదా, అరే యూస్ లెస్ ఫెలో చెప్పేది విను అని అనే మాటలు గత రెండు రోజులుగా జిల్లా కేంద్రంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఒక ఉన్నత విద్యావంతుడు, ఉన్నత అధికారి అయి ఉండి నోరు జారడంపై నిరసిస్తూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్(టి.పి.టి.ఎల్.ఎఫ్) కమిటీ ఆధ్వర్యంలో దూషించిన డి.ఈ ఓ పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రోజున కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు.