Andhra PradeshGuntur
ప్రైవేట్ పాఠశాలలో కంటికి కనిపించని కోవిడ్ నిబంధనలు

ప్రైవేట్ పాఠశాలలో కంటికి కనిపించని కోవిడ్ నిబంధనలు
పసి బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ పాఠశాలలు
క్యాపిటల్ వాయిస్ (గుంటూరు జిల్లా) నరసరావుపేట :- ఎక్కడ నిబంధనలు అమలు కావడం లేదు..కనుచూపు మేరలో కోవిడ్ ఆంక్షలు అమలు కావడం లేదు.ఏ పాఠశాలలో కూడా శానిటేషన్ ఆసులు చేయలేదు.విద్యార్థుల ఫీజ్ తప్ప వారి ఆరోగ్యం గురించి పాఠశాల యాజమాన్యం వారు అసలు పట్టించుకోవటం లేదు.నరసరావుపేట పట్టణం లో పూటగొడుగులు మాదిరి ప్రైవేట్ పాఠశాల లు పుట్టుకోవచ్చాయి .పిల్లల భవితవ్యం గురించి ఆలోచించే పాటశాల మాత్రం ఒక్కటి కూడా లేదు. పండుగ తరువాత పాఠశాల ప్రారంభించడానికి ముందు ఒక్క పాఠశాలలో కుడ శానిటేషన్ పూర్తి చేయగా పొగ ప్రతి బల్ల పై 6 పిల్లల్ని కూర్చబోబెడుతున్నారు. అందులో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో పాపం వాళ్ళకి కూడా తెలియదు. అభం శుభం తెలియాని పసి మొగ్గలు వారు .అలాగే మధ్యాహ్నం భోజన సమయంలో అందరికి ఒకే చోట కూర్చో బెట్టి వారి తల్లి తండ్రులు భోజనం చేయిస్తారు.ఆ సమయంలో పాఠశాల విద్యార్థులతో నిండి పోతుంది. అధికంగా ప్రైవేట్ పాఠశాలలు అన్ని ప్రకాష్ నగర్ లో ఉన్నాయి.కోవిడ్ నిబంధనలు పాటించటం మాత్రం కుదరని ప్రైవేట్ పాఠశాలలు ఫీజ్ ల వసూలు చేయడం లో మాత్రం వంద అడుగులు ముందు ఉంటాయి.పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు సక్రమంగా అమలు చేస్తున్నారో లేదో చూడాల్సిన విద్యశాఖ అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండటంతో వాళ్లకు భయం లేకుండా పోయింది.ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పై సమీక్షించి పసి బిడ్డల బంగారు భవితవ్యంకు భరోసా ఇవ్వాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. పాఠశాలలో కోవిడ్ నిబంధనల పై తీసుకుంటున్న చర్యలు గురించి మండల విద్య శాఖ అధికారిని సంప్రదించగా అందుబాటులో రాలేదు..