AMARAVATHIAndhra Pradesh

ప్రతిరోజు మా జపం చేయనిదే వై సి పి సభ్యులకు నిద్రపట్టడం లేదు : నారా లోకేష్

ప్రతిరోజు మా జపం చేయనిదే వై సి పి సభ్యులకు నిద్రపట్టడం లేదు : నారా లోకేష్

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్  లో అసెంబ్లీ సమావేశాల వేదికగా వైసీపీ – టీడీపీ  వార్ ముదురుతోంది. సభ ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి రోజూ.. అసెంబ్లీలో ఏదో ఒక సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు  టీడీపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఏపీలో కల్తీసారా మరణాలపై చర్చ జరగాలని టీడీపీ పట్టు పడుతోంది. దానిపై చర్చ జరిగిన తరువాత వేరే అంశాలపై మాట్లాడాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటోంది.. రోజుకో రూపంలో నిరసనలు తెలుస్తోంది. అయితే అవి కేవలం సహజరమరణాలని చెప్పి ఇష్యూను వదిలేసింది ప్రభుత్వం. దీంతో టీడీపీ సభా కార్యక్రమాలను అడ్డుకుంటోంది. అటు స్పీకర్ రోజూ వారిని సస్పెండ్ చేస్తున్నారు. అంతేకాదు.. కల్తీ సారా విషయంలో తప్పు మీది అంటే మీది అంటూ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. అయితే ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విమర్శలను తీవ్రం చేసింది అధికార వైసీపీ.. దీనిపై ఆయన కూడా అదే స్థాయిలో స్పందించారు. వైసీపీపై ఎదురుదాడికి దిగారు.శాసన సభలో తాను లేకపోయినా, అక్కడుండే వైసీపీ సభ్యులకు తనను తిట్టనిదే పూట గడవడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మండలిలో కూడా తన జపం చేయందే వారికి నిద్రపట్టడం లేదన్నారు. తనను చూసి వారు భయపడుతున్నారని తనకు అర్థం అవుతోంది అన్నారు. సభలో, బయట వారితప్పులను ఎత్తిచూపుతూ, ఆధారాలతో సహా ప్రజల్లో వారిని దోషులుగా నిలబెడుతుండడమే వారి భయానికి కారణమవుతోంది అన్నారు. తనపై వారికి చెప్పలేనంత అక్కసు, అసూయ, ద్వేషం ఉన్నాయన్నారు. అందుకే అసలు అక్కడ తాను లేకపోయినా.. తనను తిడుతూ, ప్రజల్లో హీరోలు అవుదామనుకుంటున్నారని లోకేష్ విమర్శించారు.తనను ఎవరు ఎన్ని తిట్టినా తాను పట్టించుకోను అన్నారు. కేవలం ప్రజల కోసమే అడ్డమైన వారు ఎన్ని తిట్లు తిట్టినా భరిస్తున్నాను అన్నారు. తాను తాగుబోతునని దుర్భాషలాడినా, సహించానని, తనపై చేసిన అనేక అసంబద్ధమైన, నిరాధార ఆరోపణల పై ఇదివరకే నిరూపించాలని సవాల్ చేశానని లోకేష్ తెలిపారు. కానీ వైసీపీ నుంచి ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. అతను మాట్లాడలేని భాషలో తిట్టినా ఊరుకున్నానని, వారు ఎలాంటి తిట్లు తిట్టినా.. తాను మాత్రం పెద్దవాళ్లను గౌరవిస్తానని చెప్పారు. ఆఖరికి తన వయస్సుని కూడా మర్చిపోయి, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి హద్దులు మీరి మాట్లాడినా తాను సంయమనం కోల్పోలేదన్నారు. హుందాగా, గౌరవంగానే వ్యవహరించానని లోకేష్ తెలిపారు. తన తప్పు తెలుసుకొని డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పలేదన్నారు. పేపర్ లో క్లియర్ గా ఆయన అన్నది రిపోర్టు అయిందన్నారు. అసెంబ్లీలో కూడా రికార్డైందైన్నారు.ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవారిలో ఎక్కుమంది టెన్త్ ఫెయిల్ బ్యాచ్ ఉందని.. అది మన దౌర్భాగ్యమని లోకేష్ తెలిపారు. వాస్తవాలు బయట ప్రపంచానికి తెలుస్తోందని  వైసీపీ వారికి నాటు సారా, కల్తీమద్యం అంటే భయం పట్టుకుందన్నారు. ఆధారాలతో సహా ప్రజల ముందు వారిని దోషులుగా నిలబెడుతుంటే, తనను తిట్టి సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. నాటుసారా మరణాలపై చర్చించకుండా, తప్పించుకోవడానికే పెగాసెస్ అంశాన్ని సభలో చర్చకు తెచ్చారని లోకేష్ ఆరోపించారు. పెగాసస్ విషయంలో ప్రభుత్వం వద్ద ఆధారాలుంటే హౌస్ కమిటీ వేసుకోవచ్చని ఎప్పుడో చెప్పానని లోకేష్ గుర్తుచేశారు.పెగాసస్ అంశంపై చర్చ కేవలం సభా సమయాన్ని వృథా చేయడమేనని లోకేష్ తెలిపారు. తనన తిడుతుంటే శాసనసభలో స్పీకర్ తెగ ఆనందపడిపోతున్నారని, సీఎం విరగబడి నవ్వుతున్నారని లోకేష్ తెలిపారు. ఆనాడు తన తల్లిని దూషించినప్పుడు కూడా సీఎం, స్పీకర్ రాక్షసుల్లా వికృతంగా నవ్వారని, అవేవీ మర్చిపోనన్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల లో కల్తీ సారా దొరికిన మాట నిజం కాదా అని నారా లోకేష్ నిలదీశారు. సీఎం సొంత నియోజకవర్గంలో కల్తీ సారా దొరికితే.. మిగిలిన 174 నియోజకవర్గాల్లో దొరక్కుండా ఉంటుందా అన్నారు. కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యం పై ప్రజా చైతన్య ఉద్యమం చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు.
Attachments area

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!