ప్రపంచ టైలర్స్ డే వేడుకలు జగన్ కు పాలాభిషేకం.

ప్రపంచ టైలర్స్ డే వేడుకలు జగన్ కు పాలాభిషేకం.
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) రామభద్రపురం
ప్రపంచ టైలర్స్ డే
సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి మండల టైలర్ల సంఘం పాలాభిషేకం
చేసారు.సోమవారం ఉదయం స్థానిక మండల పరిధిలోని కొట్టక్కి గ్రామంలో ప్రపంచ
టైలర్ డే సందర్భంగా మండల టైలర్ల సమావేశం సంఘ గౌరవ సలహాదారు చింతలపూడి
క్రిష్ణ అద్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి
ముఖ్య అతిధి స్థానిక మండల జడ్పీటీసి సభ్యురాలు అప్పికొండ సరస్వతి
చేతులమీదుగా పాలాభిషేకం చేసారు.ఆమె మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలోనే
కులవ్రుత్తి చేసుకునే వారికి జీవనభ్రుతి కోసం పదివేల రూపాయిలు ఆర్ధిక
సహాయం చేసిన మహానీయుడు ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.అందులో బాగంగానే
టైలరింగ్ వ్రుత్తి చేసుకునే వారికి కూడా రడీమేడ్ బట్టల వ్యవస్థ రావడం
వలన,వారికి వ్రుత్తి పని తగ్గిందని,వారి జీవనభ్రుతి కోసం సంవత్సరానికి
పదివేల రూపాయిలు వేస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా చింతలపూడి క్రిష్ణ
మాట్లాడుతూ కుట్టు మిషన్ కనిపెట్టిన లూయీస్ బ్రేవో జన్మదిన సందర్భంగా
ప్రపంచ వ్యాప్తంగా టైలర్స్ డే నిర్వహించుకుంటామని, అయితే టైలర్లను కూడా
గుర్తించి ఆర్ధిక సహాయం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని అన్నారు.అయితే
అర్హులైన వారికెవరికైనా ఆర్ధిక సహాయం అందకపోతే సంఘం ద్రుష్టికి
తేవాలని,వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల
టైలర్ల సంఘం అద్యక్షుడు ఇమంది వేంకటరమణ,టైలర్లు పాల్గొన్నారు.