Andhra Pradeshkrishna
ప్రమాదపు అంచున అంతర రాష్ట్ర కల్వర్టు……… మరమ్మత్తులు చేయండి మహాప్రభో !

ప్రమాదపు అంచున అంతర రాష్ట్ర కల్వర్టు…… మరమ్మత్తులు చేయండి మహాప్రభో !
క్యాపిటల్ వాయిస్ (ఎన్టీఆర్ జిల్లా) వత్సవాయి :- వత్సవాయి గ్రామం నుంచి తెలంగాణవైపు బోనకల్ వెళ్లే రహదారి లో చెక్ పోస్ట్ సమీపంలో కల్వర్ట్ కు పెద్ద గుంత పడి ఎప్పుడు కల్వర్ట్ కూలి పడిపోతుందో అని వాహనదారులకు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఎంతో కాలంగా పెద్ద గుంటలు ఏర్పడి ప్రయాణికులకు ఆటంకంగా ఉన్న ఈ కల్వర్టు ఇటీవల మరమ్మత్తు పనుల నిమిత్తమై కొద్దీ రోజుల క్రితం వాహనాల రాకపోకలు బంద్ చేసారు. దీంతో నిత్యము ఈ రహదారిపై ప్రయానించే వాహనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కనుక ఇప్పటికైనా కల్వర్టు నిర్మాణం పనులు జాప్యం చేయకుండా త్వరితగతిన మరమ్మతులను పూర్తి చేసి, ప్రయాణికులకు మార్గం సుగమం చేయాలని ప్రజలు తీవ్రంగా కోరుతున్నారు.