Andhra PradeshVijayanagaram
ప్రమాదానికి గురైన భాదితులను పరామర్శించిన బొబ్బిలి టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన

ప్రమాదానికి గురైన భాదితులను పరామర్శించిన బొబ్బిలి టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) రామభద్రపురం :- స్థానిక మండలంలో గల మిర్తివలస గ్రామానికి చెందిన గ్రామస్థులు 25 మందికి పైగా సోమవారం రాత్రి గుప్తేశ్వరం వెళ్ళి వస్తుండగా ఏక్సిడెంట్ కి గురై దెబ్బలు తగిలి, విజయనగరం మహారాజా హాస్పిటల్ లో చేరడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఆర్ వి ఎస్ కె కె రంగారావు (బేబినాయన) మంగళవారం తెల్లవారుజామున హుటాహుటిగా విజయనగరం మహారాజా హాస్పిటల్ కి వెళ్లి బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పి వారి చికిత్స కొరకు డాక్టర్ గారితో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా కోరారు. నాయన తో పాటు రామభద్రపురం మండల ముఖ్య నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతి నాయుడు కూడా పరామర్శించారు.