ప్రకృతి పాఠశాల కరపత్రం ఆవిష్కరణ

ప్రకృతి పాఠశాల కరపత్రం ఆవిష్కరణ
క్యాపిటల్ వాయిస్ ప్రతినిధి, కారంపూడి :-
స్థానిక సత్య సాయి బాబా దేవాలయంలో ప్రకృతి పాఠశాల కరపత్రం ఆవిష్కరించిన ప్రకృతి మూలక సేకరణ నిపుణుడు కొమెర జాజి మాట్లాడుతూ
ప్రకృతిలో ఎన్నో రకముల వన మూలికల ఉపయోగములు తెలిపే మహాకార్యక్రమం ప్రకృతి పాఠశాల అని ప్రకృతి పాఠశాల ఉద్దేశం ప్రతి బడిలో ఉన్న విద్యార్థులు కు ప్రకృతిలో ఉన్న వన మూలికలు ఉపయోగములు చెప్పడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు మేలు చేసే మొక్కలు గురించి చెప్పడం,ఇందులో ప్రతిఒక్కరికి ప్రకృతిలో మొక్కలు చెట్లు గొప్పతనం గురించి చెప్పి అవి మానవాళికి ఎలా ఉపయోగపడతాయో వివరించి వారితో మొక్కలు నాటించడం చేపడతామన్నారు అనంతరం ప్రకృతిమూలికా సేకరణ నిపుణుడు కొమెర జాజి కి శ్రీ సత్యసాయి ఆర్గనేషన్స్ కారంపూడి వారు అభినందనలు తెలియజేశారు ప్రకృతి పాఠశాల కరపత్రం విడుదల అనంతరం చెన్నై యూనివర్సిటీ లో గౌరవ డాక్టరేట్ తీసుకున్న కొమెర జాజికి సత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ వారు సన్మానం చేశారు ఇతను ప్రకృతిలో గురించి చెప్పిన సత్య సాయి బాబా చారిటబుల్ ట్రస్ట్ వారు మాట్లాడుతూ విలేజ్ లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానెల్ లో ఎన్ని వీడియోలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.