Andhra PradeshNellorePolitics

ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి:అబ్దుల్ అజీజ్

ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి:అబ్దుల్ అజీజ్

క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు మంగళవారంనెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయం లో నెల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్ చార్జులు, మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ప్రజా పతినిధులతో సమావేశం నెల్లూరు పార్లమెంటు అధక్షులు అబ్దుల్ అజీజ్ గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగుబడి సరిగా లేక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని పరిస్థితుల్లో తక్కువ ధరకే రైతులు ధాన్యాని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి అమ్మారు. ప్రభుత్వము ధాన్యాని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి నెలలు గడచిన ఇంత వరకు వారికి డబ్బులు ఇవ్వలేదు. మన జిల్లా లోనే దాదాపు రూ.108 కోట్ల బకాయిలు చెల్లించవలసిఉన్నది. బకాయిలను ప్రభుత్వం తక్షణమే రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశంలో తీర్మానించడం జరిగిందన్నారు. జగనన్న కాలనీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అదే విధముగా లే ఔట్స్ లెవెలింగ్ కార్యక్రమం లో వై.సి.పి. నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. కావున ప్రభుత్వం దీని పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ న్నా మన్నారు. జిల్లా లో గ్రావెల్, ఇసుక, మట్టి దోపిడి పెద్ద ఎత్తున జరుగుతుంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో జరుగుతున్న ఈ దోపిడి పై జిల్లా అధికార యంత్రాంగానికి ఎన్ని మారులు ఫిర్యాధు చేసిన కనీస స్పందన కూడా లేదు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాగం స్పందించని పక్షంలో అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని అన్నారు.కరోన వలన మరణించిన వ్యక్తికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబానికి ఇవ్వాలని, ప్రతి తెల్ల రేషన్ కార్డ్ ఉన్న కుటుంబానికి ర.10వేలు ఆర్ధిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధముగా అత్యంత నాణ్యతా ప్రమాణం కలిగిన TIDCO గృహాలను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించి లభ్ధిధారులను ఎంపిక చేయడం జరిగిందని . ఎన్నికల కోడ్ కారణముగా తెలుగుదేశం ప్రభుత్వం లభ్ధిధారులకు ఇళ్లను స్వాదినం చేయ లేదని తదుపరి అధికారం లోకి వొచ్చిన వై.సి.పి ప్రభుత్వం 2 ఏళ్లు గడచిన ఆ ఇళ్లను లభ్ధిధారులకు స్వాదిన పరచలేదన్నారు. కావున ప్రభుత్వం వెంటనే TIDCO ఇళ్లను లభ్ధిధారులకు స్వాదినం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ న్నామన్నారు.గ్రామీణ/పట్టణ ప్రాంతాలలో ఎన్.టి.ఆర్. హౌసింగ్ పధకం క్రింద తెలుగుదేశం ప్రభుత్వ హయాములో ఇల్లులు నిర్మించుకున్న లభ్ధిధారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1340 కోట్లు బకాయిలు చెల్లించవసిఉన్నది. కావున రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాములో నీరు – చెట్టు పధకం క్రింద పని చేసిన వారికి తక్షణమే బిల్లులు చెల్లించాలని గత ప్రభుత్వం హయాములో ఉపాధి హామీ పధకం క్రింద పనులు చేసిన వారికి హై కోర్ట్ ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష ఆదోళన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం పెంచిన హౌస్ టాక్స్ లను వెంటనే తగ్గించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని SC, ST, BC, మైనారిటీ, కాపు కార్పొరేషన్ ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాములో పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది. వై.సి.పి అధికరంలోకి వొచ్చిన తరువాత పై కార్పొరేషన్ ద్వారా వొచ్చే రుణాలను పూర్తిగా నిలిపివేసిందన్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయ రామి రెడ్డి, పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి,కురుగుండ్ల రామకృష్ణ, నెలవల సుబ్రమణ్యం, బొల్లినేని వెంకటరామారావు,పాసిం సునీల్ కుమార్, దివి శివరాం,నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మరియు నాయకులు పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి , ఆనం వెంకటరమణారెడ్డి, చెంచల్ బాబు యాదవ్ , జెడ్ శివ ప్రసాద్, తాళ్ళపాక అనురాధ ,జన్ని రమణయ్య, పట్టాభి రామిరెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు,ఇంటూరి రాజేష్, బొమ్మీ సురేంద్ర, వేనాటి సతీష్ రెడ్డి, వేలూరు రంగారావు, దావా పెంచాల్ రావు, బొమ్మన శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!