Andhra PradeshWest godavari
ప్రజాసేవలో నూతన ఒరవడికి గోపాలపురం గడపలోకి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శ్రీకారం

ప్రజాసేవలో నూతన ఒరవడికి గోపాలపురం గడపలోకి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శ్రీకారం
క్యాపిటల్ వాయిస్ ప్రతినిధి, పశ్చిమగోదావరి జిల్లా :- దేవరపల్లి:ప్రతిష్ఠాత్మకమైన సరికొత్త కార్యక్రమంతో ప్రజాసేవలో ఒక నూతన ఒరవడికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శ్రీకారం చుట్టారు.మంగళవారం నుండి’రాజన్న అడుగునై జగనన్న వెలుగుకై మీ ముంగిటకు మీ ఎమ్మెల్యే’ అనే నినాదంతో ప్రారంభించనున్న”గోపాలపురం గడపలోకి”అనే కార్యక్రమం ద్వారా గోపాలపురం నియోజక వర్గ ప్రజానీక సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించేందుకు అన్ని గ్రామాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పాదయాత్ర,అనంతరం మధ్యాహ్నం సచివాలయ ఉద్యోగులతో వాలంటీర్లతో ప్రత్యేక సమావేశాలు,సాయంత్రం మండల స్థాయి అధికారులతో కలిసి రచ్చబండ ద్వారా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించినట్లుగా వెల్లడించారు.ఈ బృహత్కార్యంలో ప్రతీ రోజూ ప్రతి ఒక గ్రామంలో క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోవడానికి గాను,అధికారులు,ప్రజలు,వైఎస్సార్సీపీ మండల,గ్రామ స్థాయి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పాదయాత్ర,గ్రామస్తులతో గ్రామ సభ,అధికారులతో సచివాలయ సమావేశం,నిర్వహించి పల్లెలలోని సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని తెలిపారు.అంతేగాక“జగనన్న పచ్చతోరణం”లో గ్రామస్తులను భాగస్వాములుగా చేర్చి,గ్రామంలో పలుచోట్ల మొక్కలు నాటించడమే కాకుండా,వాటి సరక్షణకు బాధ్యత అప్పచెప్పి,పల్లెలో పచ్చదనం పెంపొందించి,జగనన్న ఆశయాన్ని విజయవంతం చేస్తారు.గ్రామాల్లో నాడు-నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభిస్తారు. పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుసుకోవడం క్షేత్రస్థాయిలో గ్రామంలో కలియతిరగడం ద్వారా ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ఇది ఒక చక్కటి అవకాశం అని,అసలైన అర్హులకు ప్రభుత్వ పథకాలు అందని వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చేందుకు అవకాశం ఉంటుందని,గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను సైతం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు అవకాశాలున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ నేపధ్యంలో “గోపాలపురం గడపలోకి” వివరాలు తెలిపే పోస్టర్ ను దేవరపల్లి క్యాంపు కార్యాలయంలో విడుదల చేసారు. ముందుగా మంగళవారం గోపాలపురం మండలం హుకుంపేట సచివాలయం పరిధి,బుధవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం సచివాలయ పరిధి, గురువారం నల్లజర్ల మండలం పోతినిడుపాలెం సచివాలయం పరిధి, శుక్రవారం ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం సచివాలయ పరిధిలో గల గ్రామాల్లో పర్యటించనున్నట్లుగా వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.