Andhra PradeshGuntur
ప్రజానేత డాక్టర్ వైఎస్ఆర్ కు ఘన నివాళి

ప్రజానేత డాక్టర్ వైఎస్ఆర్ కు ఘన నివాళి
క్యాపిటల్ వాయిస్, కారంపూడి ప్రతినిధి :- కారంపూడి పట్టణంలో స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద వైస్సార్ 12వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ మండల పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశ స్థాయి లో ప్రజా పాలన ని సమర్థవంతంగా నిర్వహించి ఎంతోమంది మన్ననలను పొంది నిరంతరం ప్రజా సేవకుడు గా పేదల పెన్నిధి గా పేరొందిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలకి పెద్దకొడుకు డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించి 12 సంవత్సరాలు అయినా ఆయన కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో మన మధ్యనే ఉంటూ నిరంతరం మన క్షేమాన్ని కోరుకుంటూ పేదల అభివృద్ధికి పాటుపడుతూ మన జగనన్న రూపంలో మన మధ్యలోను ఉంటూ అందరి బాగోగులు చూస్తూ ఎంతమంది పేద ప్రజల కన్నీళ్లు తుడుస్తూ పేదలకు చేదోడువాదోడుగా ఉంటున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న మనకోసం మనందరి బాగుకోసం వైయస్సార్ ఆశీస్సులతో వచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ అక్బర్, పట్టణ నాయకులు బొమ్మిన అల్లయ్య, మండల యూత్ నాయకులు చిలుకూరు చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ సీనియర్ నాయకులు కొమ్ము చంద్రశేఖర్, బీసీ నాయకులు కొమర పిచ్చయ్య, కారంపూడి సర్పంచ్ ప్రమీలా భాయ్ తేజ నాయక్, బూత్ లెవల్ మేనేజర్ పాతురి రామిరెడ్డి. కంపా నాగరాజు మైనార్టీ నాయకులు ఆరిఫ్ .బీసీ నాయకులు చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఒప్పిచర్ల లో …. ఒప్పిచర్ల గ్రామములో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నాయకులు నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ రామిదేని ఆంజనేయులు, మాజీ ఎంపీపీ పంగులూరి చిన వెంకట
నరసయ్య, మాజీ ఎంపీటీసీ ఓగూరి రామయ్య, నీళ్ల అంజయ్య, చిరుమామిళ్ల బుచ్చయ్య , వంకాయలపాటి పిచ్చయ్య , చిరుమామిళ్ల వీరేశ్వర రావు , ఉన్నం హరిబాబు, కూరాకుల మల్లిఖార్జున రావు , పాలకీర్తి నరేంద్ర, చింతపల్లి శ్రీను, బండారు రాముడు, లాజర్ తదితరులు పాల్గొన్నారు.
నరసయ్య, మాజీ ఎంపీటీసీ ఓగూరి రామయ్య, నీళ్ల అంజయ్య, చిరుమామిళ్ల బుచ్చయ్య , వంకాయలపాటి పిచ్చయ్య , చిరుమామిళ్ల వీరేశ్వర రావు , ఉన్నం హరిబాబు, కూరాకుల మల్లిఖార్జున రావు , పాలకీర్తి నరేంద్ర, చింతపల్లి శ్రీను, బండారు రాముడు, లాజర్ తదితరులు పాల్గొన్నారు.