ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కాన్పు కష్టం అన్నారు….గర్భిణీకి 108 లో ప్రసవం

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కాన్పు కష్టం అన్నారు….గర్భిణీకి 108 లో ప్రసవం
క్యాపిటల్ వాయిస్, నెల్లూరు జిల్లా :- ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆ గర్భిణికి కాన్పు కష్టమవుతుందని చేతులెత్తేశారు. అయితే 108 సిబ్బంది కాన్పుచేసి తల్లీబిడ్డలను కాపాడారు. సూళ్లూరుకు చెందిన నిండు గర్భిణి మౌనిక పురిటి నొప్పులతో శనివారం సూళ్లూరుపేట సర్వజన ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టమవుతుందని, వెంటనే గూడూరుకు తరలించాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. దాంతో 108 సిబ్బంది ఆమెను గూడూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో సిబ్బంది రోడ్డుపక్కనే వాహనాన్ని నిలిపి ఆమెకు కాన్పు చేశారు. బిడ్డ మెడకు పేగు చుట్టుకొని ఉండటంతో కష్టపడి ప్రసవం చేశామని ఈఎంటీ సుభకర్, పైలెట్ ఈశ్వరయ్య చెప్పారు. తల్లీబిడ్డలను కాపాడినందుకు బంధువులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.