Telangana
పోసాని ఇంటిపై దుండగుల రాళ్ల దాడి.. బూతులు తిడుతూ వీరంగం !?

పోసాని ఇంటిపై దుండగుల రాళ్ల దాడి.. బూతులు తిడుతూ వీరంగం !?
క్యాపిటల్ వాయిస్, తెలంగాణ :- సినీ నటుడు పోసాని క్రిష్ణ మురళి ఇంటిపై పలువురు దాడికి యత్నించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేస్తూ బూతులు తిడుతూ వీరంగం ప్రదర్శించారు. దీంతో వాచ్‌మెన్ సహా కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు. ఈ ఘటనపై ఆయన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. ఇటీవల పోసాని పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం కూడా పోలీసుల ఎదుటే పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు పోసానిని కాపాడి అక్కడి నుంచి తరలించారు.