పొరపాటున కూడా నిద్రపోయే ముందు ఈ పనులు చేయకండి !

పొరపాటున కూడా నిద్రపోయే ముందు ఈ పనులు చేయకండి !
క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర చాలా అవసరం.. సరైన నిద్ర లేకపోవడం వలన అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలాగే నిద్రించే ముందు కొన్నింటికి దూరంగా ఉంటే చాలా మంచిదని సూచిస్తున్నారు .. అవేంటో ఇప్పుడు
తెలుసుకుందాం..!
రాత్రిపూట నిద్రపోయే సమయానికి భోజనానికి మధ్య కనీసం మూడు గంటల సమయం ఉండేలాగా చూసుకోవాలని వైద్యుని పనులు చెబుతున్నారు.. అలా కాకుండా కొందరు నిద్రించే ముందు భోజనం చేస్తుంటారని.. మరికొందరైతే కొవ్వు పదార్థాలు,కారం, మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలను బాగా తిని వెంటనే నిద్రిస్తుంటారు.. అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని..గ్యాస్, అసిడిటీ , తల తిరగడం, అధికంగా బరువు పెరగడం, డయాబెటిస్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది మద్యం సేవించి నిద్రిస్తున్నారని.. అలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య మరింత ఎక్కువవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు..దగ్గు, జలుబు, అలర్జీల కోసం వేసుకునే టాబ్లెట్స్ వల్ల కూడా కొందరిలో నిద్రలేమి సమస్య కలుగుతుందని.. ఆ మందులు ఎక్కువగా దీర్ఘకాలం పాటు వాడకుండా డాక్టర్లు సూచనల మేరకు అవసరమైనంతవరకే వాడాలని చెబుతున్నారు..వీటి వలన కూడా నిద్రలేమి సమస్య వస్తుందని మందులను కూడా మితిమించి వేసుకోకూడదు అని సూచిస్తున్నారు.. రాత్రిపూట టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, ఫోన్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు చాలా దూరం ఉండాలని..లేదంటే నిద్రలేమి సమస్య మరింత ఎక్కువ అవుతుందని త్వరగా నిద్ర పట్టకపోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని .. వీటివల్ల కంటికి ఎఫెక్ట్ చూపిస్తుందని నిద్రకు భంగం కలగటమే కాకుండా కంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.