పూరిగుడిసేలో నివసిస్తున్న వారిపై దౌర్జన్యం తగదు
పూరిగుడిసేలో నివసిస్తున్న వారిపై దౌర్జన్యం తగదు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
భీమిలి నియోజకవర్గం జివియంసి జోన్ 2 మధురవాడ 7 వ వార్డు కళా నగర్ కాలనీలో పూరిగుడిసేలో పదిహేను సంవత్సరాల నుండి నివాసము ఉంటున్న మహిళలను జోన్ 2 టౌన్ సిబ్బంది మానసికంగా పలు ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. వివరాలోకి వెళ్తే మధురవాడ దరి కళా నగర్ కాలనీలో లగుడు.జగదీశ్వరి పదిహేను సంవత్సరాల నుండి పూరి గుడిసె నిర్మించుకొని ఆవులను పెంచుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హఠాత్తుగా రెండు రోజుల నుండి జోన్ 2 టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయం సిబ్బంది కలసి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇది పార్క్ స్థలం వెంటనే కాలీ చేసి వెళ్లిపో అన్నారు.దానికి లగుడు. జగదీశ్వరి సచివాలయం సిబ్బందితో నేను ఇంటికి పన్ను కట్టుకుంటున్నాను కరెంట్ మీటరు ఉంది బిల్లు కూడా సక్రమంగా కట్టుకుంటున్నాను అని మొర పెట్టుకున్న వారు కాలీ చేయకపోతే బలవంతముగా తన్ని కాలీ చేయిస్తామని బెదిరించి ఇంటి ముందు గచ్చును గున పాలతో ఇష్టానుసారముగా తవ్వెసారు.తక్షణమే జివియంసి ఉన్నత అధికారులు స్పందించి జగదీశ్వరి కి న్యాయము చేయాలని ఎదైనా సమస్య ఉంటే లీగల్ గా వెళ్లాలి గాని ఇలా దౌర్జన్యము చేయడం సమంజసం కాదని ప్రజాసంఘాల సభ్యులు, మానవ హక్కుల సంఘాల సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.