పిల్లాడిని వేలాడదీసిన హెడ్‌మాస్టర్ అరెస్ట్….సోషల్ మీడియాలో వైరల్ !

పిల్లాడిని వేలాడదీసిన హెడ్‌మాస్టర్ అరెస్ట్….సోషల్ మీడియాలో వైరల్ !
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- యూపీలో రెండో తరగతి చదివే విద్యార్థిని హెడ్ మాస్టర్ బిల్డింగ్ మీది నుంచి కిందకు వేలాడదీశాడు. మీర్జాపూర్‌లోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మనోజ్ విశ్వకర్మ అనే హెడ్‌మాస్టర్ 2వ తరగతి చదివే విద్యార్థిని తీసుకెళ్లి బిల్డింగ్ మీది నుంచి తల కిందులుగా వేలాడదీశాడు. దీంతో ఆ పిల్లాడు భయంతో వణికిపోయాడు. హెడ్ మాస్టర్ సారీ చెబితేనే కిందికి దించుతానంటూ ఆ పిల్లాడిని బెదిరించాడు. ఇంతలో తోటి విద్యార్థులు గట్టిగా అరవడంతో ఆ హెడ్ మాస్టర్ పిల్లాడిని కిందికి దించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న పిల్లాడి తల్లిదండ్రులు వెంటనే ఆ హెడ్‌మాస్టర్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద బుక్ చేశారు. అయితే బాధిత బాలుడు చాలా అల్లరి చేస్తుంటాడని, తోటి విద్యార్థులను, టీచర్లను కొరుకుతాడని హెడ్ మాస్టర్ చెప్పారు. అతడి తండ్రే కొంచెం హద్దుల్లో పెట్టండి అని చెప్పాడని, అందుకే పిల్లాడిని భయపెట్టేందుకు అలా చేశాం అని హెడ్‌మాస్టర్ మీడియాకు తెలిపాడు.