ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండిస్తూ నిరసన

ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండిస్తూ నిరసన : ఖాద్రి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్
క్యాపిటల్ వాయిస్, (అనంతపురం జిల్లా), కదిరి అర్బన్:- అనంతపురం ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం మరియు సిబ్బంది ఫోటోగ్రాఫర్ పై చేసిన దాడిని ఖండిస్తూ శనివారం ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ తరపున కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా నుంచి అంబేద్కర్ కూడలి వరకు నిరసన కార్యక్రమాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టైల్ కింగ్ భాష ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు, ఫోటోగ్రాఫర్ ప్రెసిడెంట్ భాష మాట్లాడుతూ కేవలం లిఫ్ట్ లో వచ్చాడని ఉద్దేశంతో ఒక ఫోటోగ్రాఫర్ పై హోటల్ యాజమాన్యం సిబ్బంది మూకుమ్మడి దాడి చేయడాన్ని ఖాద్రి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ తరపున ఖండిస్తున్నామన్నారు , ఫోటోగ్రఫీ ఒక కళగా ఆ వృత్తిని చేసే వ్యక్తిని కళాకారునిగా గుర్తించాలని నేటి సమాజంలో కళాకారులకు కలిగిన కనీస మర్యాదను కల్పిస్తే చాలని, ఫోటోగ్రాఫర్ అంటే ఏదో బజారులో తిరిగే పోరంబోకు బ్యాచ్ అనే విధంగా దాడి చేశారని, ఎస్ ఆర్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం మరియు సిబ్బంది పై చట్టపరమైన చర్యను వెంటనే తీసుకోవాలని, బాధిత ఫోటోగ్రాఫర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావతం కాకుండా ఉండేవిధంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొనడం జరిగింది.