Andhra PradeshVisakhapatnam
పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ పై పన్నుల పెంపును, ప్రజలను హింసిస్తున్న మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన వామపక్షాలు

పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ పై పన్నుల పెంపును, ప్రజలను హింసిస్తున్న మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన వామపక్షాలు.
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :-పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ పై పన్నులు వేసి ధరలు పెంచి ప్రజలను హింసిస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఉద్యమించాలని మధురవాడ వామపక్ష పార్టీలు ప్రజలను కోరాయి.
దేశవ్యాప్తంగా వామపక్షాలు పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంపు పై ఆందోళన కార్యక్రమాలకు పిలుపు లో బాగంగా మధురవాడ సీపీఐ,సీపీఎం పార్టీలు ఆందోళన కార్యక్రమం గురువారం చేపట్టాయి.మధురవాడ కూడలివద్ద నినాదాలు చేశారు.అనంతరం అనంతరం సేవా రహదారి పై రాస్తా రోకో చేశారు.దిష్టిబొమ్మ ఊరేగి
స్తుండగా పోలీసులు లాక్కుని చింపి వేశారు.వామపక్ష కార్యకర్తలు చేస్తున్నా నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.యీ సందర్భంగా తోపులాట కు,ఉద్రిక్త పరిస్తితి కి దారి తీసింది.ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతు బీజేపీ వాళ్ళు మన దేశ ప్రజలను భానిసలుగా మార్చే కుట్రలు చేస్తున్నారని అన్నారు.అందులో బాగంగా నే నిరసన తెలియజేయకుండా పోలీసులతో నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ పై పన్నులు వేసి ధరలు పెంచి ప్రజలను పీల్చి పిప్పు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ తో పాటు, ఇతర నిత్యావసర వస్తువులు ధరలు పెంచి, తద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపుకుని, ఆ సంపదను స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ కంపెనీలకురాయితీలు ఇస్తు, వారు ప్రభుత్వ బ్యాంకుల కు ఎగ్గొట్టినఅప్పులు తీరుస్తున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అబద్ధాలు చెబుతున్న, నరేంద్ర మోడీ బిజెపి పరివారం మన పక్కనే ఉన్న నేపాల్, శ్రీలంక దేశాలలో లీటర్ పెట్రోల్ డీజిల్ ను 50 నుండి 60 రూపాయలు లోపు ప్రజలకు ఇస్తున్నారని తెలియజేశారు. వారిని చూసి నరేంద్ర మోడీ నీ సిగ్గు తెచ్చుకోవాలని కోరారు. ప్రజల శ్రమ ద్వారా మనదేశంలో సృష్టించబడిన సంపదను,వనరులను అంబానీ ఆధాని లకు దోచి పెడుతున్నారని అన్నారు.కార్పోరేట్లు ఇచ్చే ముడుపులతో ఎన్నికల్లో గెలవడం కోసం దేశ ప్రజలను వంచించి,అబద్ధాలు చెపుతూ మోసం చేస్తున్నారని అన్నారు.ప్రజలందరూ బీజేపీ,మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు డీ అప్పలరాజు,డీ కొందమ్మ,ఏ గురుమూర్తి రెడ్డి,ఎస్ పైడితల్లి,సీపీఐ నాయకులు వి సత్యనారాయణ,ఎండీ బేగం,కే మేగారావు,కే వెలంగినిరావు సీపీఐ, సీపీఎం నాయకులు డీ అప్పలరాజు,వి సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు.
