పవన్‌తో వైకాపా నేత కీలక భేటీ – జనసేన లో చేరుతున్నట్లుగా ఊహాగానాలు !?

పవన్‌తో వైకాపా నేత కీలక భేటీ – జనసేన లో చేరుతున్నట్లుగా ఊహాగానాలు !?
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో వైకాపాకు చెందిన కీలక నేత ఒకరు భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఈ భేటీ జరిగింది. ఆ నేత పేరు బొంతు రాజేశ్వరరావు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైకాపా కీలక నేత. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా రాజేశ్వర రావు పోటీ చేయగా, ఆయన పై జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఇప్పుడు రాజేశ్వర రావు జనసేనాని తో భేటీ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్.డబ్ల్యూ ఎస్ రాష్ట్ర మాజీ సలహాదారు అయిన రాజేశ్వర రావు హైదరాబాద్ నగరం లోని జనసేన పార్టీ కార్యలయం లో సమావేశమయ్యారు.కాగా, ఈయన గత 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైకాపా నేతలు అంటీ అంటనట్టు గా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.అందుకే స్థానిక ఎమ్మెల్యేపై జానసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు వైసీపీ రాపాకకు ప్రాధాన్యం పెరగడంతో.. ఆ పార్టీ నేతలు పక్కదారి పడుతున్నారు. ఇప్పికే కీలక నేతలు కొందరు పక్కా పార్టీల్లోకి చేరగా.. ఇప్పుడు మరో వికెట్ డౌన్ అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.. ఆ నేతకు రాజోలులో మంచి పట్టు ఉందని.. వైసీపికి చెందిన బలమైన కేడర్ అంతా ఆయన వెంటే ఉందనే ప్రచారం ఉంది. ఆయన ఎవరో కాదు.. వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిపోయిన బొంతు రాజేశ్వరావు.. తనకు అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ.. అధికారపార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో ఆయన భేటీ కావడం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ఇరు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.