Andhra PradeshVisakhapatnam
పర్యావరణ రహిత నగరంగా విశాఖ : గొలగాని హర వెంకట కుమారి

పర్యావరణ రహిత నగరంగా విశాఖ : గొలగాని హర వెంకట కుమారి
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- పర్యావరణ రహిత నగరంగా మన విశాఖను తీర్చి దిద్దాలని నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషణ్ వారి ఆధ్వర్యంలో పాత డైరీ ఫారం ఎసిబి ఆఫీసు ప్రక్కన మొక్కలు నాటే కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషణ్ వారు దేశంలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారని, దేశంలో 23 రాష్ట్రాలలో, క్రేంద్రపాలిత ప్రాంతాలలో కూడా క్రోకేర్ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, నేడు ఆధునీకరణ పేరుతొ చెట్లను నరికివేస్తున్నారని, దీనివలన అతివృష్టి, అనావృష్టి ఏర్పడి మానవ జీవనంతో పాటు, పశువులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, అందుకు అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించగలిగితేనే మానవ మనుగడ బాగుంటదని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వికాస్ పాండే, స్టేట్ ప్రెసిడెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషణ్ తదితరులు పాల్గొన్నారు.