పర్యాటకులతో కిటకిటలాడే విశాఖ ఆర్కే బీచ్ – ఇపుడు కంపుతో కసకసలాడుతోందోచ్ !?

పర్యాటకులతో కిటకిటలాడే విశాఖ ఆర్కే బీచ్ – ఇపుడు కంపుతో కసకసలాడుతోందోచ్ !?
క్యాపిటల్ వాయిస్, విశాఖ ప్రతినిది :- విశాఖ ఆర్కే బీచ్ నిత్యం పర్యటకలు వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు.. పర్యాటకులతో కిటకిటలాడే ఆర్కే బీచ్ ఇప్పుడు కంపు కొడుతుంది. దానికి కారణం పర్యాటకులు స్నానం చేసే ప్రాంతంలోనే మురుగు నీరు వచ్చి చేరుతుండటం. విశాఖ ఆర్కే బీచ్ బస్ స్టాప్ నుండి నోవాటెల్ హోటల్ మధ్య ఉన్న డ్రైనేజీ కాలవ సముద్రంలోకి రావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీచ్ కొచ్చే పర్యటకులు స్నానాలు చేస్తూ ఉంటే పక్కనే డ్రైనేజీ కాలవ సముద్రంలోకి వచ్చి కలుస్తుంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు పర్యాటకులు బీచ్ అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. మరోవైపు డ్రైనేజీ వచ్చి సముద్రంలో చేరుతుంది. ఇంక ఆ ప్లేస్‌లో పర్యాటకులు ఫొటోలు దిగడం ఆపేసి..ఇదేంటి డ్రైనేజీ వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తోంది…రోజు ఇందులోనేనా మనం స్నానాలు చేసి ఆడుకుంటుంది అనే అనుమానంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదంతా ఎక్కడో కాదు మన ఆర్కే బీచ్‌లో కనిపించిన దృశ్యం..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందమైన నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఈ నగరానికి వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం ఉంది. విశాఖపట్నం వచ్చి ప్రముఖ బీచ్ లను సందర్శించకుండా ఎవ్వరూ నగరం దాటరు. తెల్లవారుజామున వాకింగ్ మొదలుకొని సాయంత్రం వేళ సేద తీరే వరకూ సందర్శించాల్సిన అనేక బీచ్‌లు ఇక్కడ ఉన్నాయి. ఇవి పర్యకులకు వినోదాన్ని పంచడంతో పాటు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అలా నిత్యం పర్యాటకులు సేదతీరే తీరప్రాంతాల్లో ఆర్కే బీచ్ మొదటి స్థానంలో ఉంటుంది.