Andhra PradeshVisakhapatnam
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కేజీహెచ్ లో మొక్కలు నాటిన నగర మేయర్ .

పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కేజీహెచ్ లో మొక్కలు నాటిన నగర మేయర్ .
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి.
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందని నగర మేయర్ వెంకట కుమారి పేర్కొన్నారు. ఆదివారం ఆమె కేజీహెచ్లో రేపాక సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన కనీస బాధ్యత మన అందరిమీద ఉందని అందుకు ప్రతి ఒక్కరూ తలో మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేబాక సూర్య నారాయణ ఆధ్వర్యంలో కేజీహెచ్లో మొక్కలు నాటడం ఎంత సంతోషమని, ఈరోజు జీవీఎంసీ ఆధ్వర్యంలో ఈ రెండు నెలల కాలంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, నేడు చెట్లను విచ్చలవిడిగా నరికి వేయడం వలన కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని దీన్ని తగ్గించుకునేందుకు అందరూ మొక్కలు నాటాలని, భూమి కలుషితం కాకుండా ప్లాస్టిక్ భూతాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు.