Viral News

పానీ పూరి పై మనసు పడ్డ ఏనుగు …… ఆహారం అందించిన పానీపూరీ నిర్వాహకుడు

పానీ పూరి పై మనసు పడ్డ ఏనుగు …… ఆహారం అందించిన పానీపూరీ నిర్వాహకుడు

క్యాపిటల్ వాయిస్, వైరల్ సమాచారం :-  ఏనుగులు గడ్డి తింటాయి. చెరుకుగడలను నమిలేస్తాయి. అరటి ఇతర పండ్లను ఆసక్తిగా తింటాయి. కానీ పానీ పూరీ తినడం మనం ఎప్పుడూ చూసి ఉండం. ఓ ఏనుగు మాత్రం పానీ పూరీ తింటూ ఎంజాయ్ చేసింది. ఒక్కో పానీ పూరీలో బఠాణీ కర్రీ, ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి ఇస్తుంటే.. లొట్టలేసుకొని లాగించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని మనం కూడా చూద్దాం. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.పానీ పూరీని ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ పానీపూరీని ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరికీ పానీపూరీ ఫేవరెట్. చక్కగా పానీ పూరీలో ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే.. తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. అంతెందుకు పానీపురీ బండి పక్క నుంచి వెళ్తే నోరు ఊరిపోతూ ఉంటుంది. కచ్చితంగా అక్కడ ఆగి తినాల్సిందే. అయితే ఇప్పుడు ఓ వీడియో చూస్తే.. తెలుస్తుంది మనుషులే కాదు జంతువులు కూడా పానీపూరీని ఇష్టపడుతున్నాయని.చాలా అరుదుగా ఇలాంటి వీడియోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏకంగా పానీపూరీని తినేస్తోంది ఏనుగు. ఈ వీడియోలో ఏనుగు పానీపూరీ బండి పక్కన నిలబడి తొండంతో పానీపూరీలను తీసుకొని తినేస్తోంది. పానీపూరీ అమ్మే వ్యక్తి… ఏనుగుని ఏమనకుండా పానీపూరీ ఇస్తున్నాడు. ఎంతో ఆనందంగా ఏనుగుకి పెడుతున్నాడు. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు చాలా మంది జనం అక్కడికి చేరి ఎంతో ఆనందంగా చూస్తున్నారు. చాలామంది ఈ అరుదైన సన్నివేశాన్ని చూసి తమ మొబైళ్లలో రికార్డు చేస్తున్నారు.మామూలుగా ఎక్కడైనా మనుషులు పానీపురీ తింటూ ఉంటారు కానీ జంతువులు పానీపూరీ తినడం ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఏనుగు ఒక రోడ్డు పక్కన పానీపూరీ బండి దగ్గర నిలబడి పానీపూరీ తినడం మనం వీడియోలో చూడొచ్చు. చాలా విచిత్రంగా ఉంది కదా? నిజంగా అక్కడికి వచ్చి జనం కూడా ఆశ్చర్య పోతున్నారు. ఈ సన్నివేశాన్ని చూసి చాలా మంది ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. మనకి ఇలాంటివి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోని చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. పైగా పానీపూరీని తింటూ ఏనుగు చక్కగా ఆనందిస్తోంది. పానీపూరీ అమ్మే వ్యక్తి ఏనుగుపై ఏ మాత్రం చిరాకు పడకుండా దానికి పానీపూరీని ఇస్తున్నాడు. ఎంతో ప్రేమగా ఏనుగుకి పానీపూరీని ఇస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!