Andhra PradeshVisakhapatnam
పందుల నిర్మూళన దిశగా జోన్ 2 కమిషనర్ బొడ్డేపల్లి రాము

పందుల నిర్మూళన దిశగా జోన్ 2 కమిషనర్ బొడ్డేపల్లి రాము…
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ 2, మధురవాడ 5,6,7,8 వార్డులు లలో మంగళవారం తెల్లవారు 6గంటలనుండి జీవీఎంసీ అధికారులు జోన్ 2కమీషనర్ ఆధ్వర్యంలో వెటర్నరీ డాక్టర్ కిషోర్ సంయుక్తంగా పందులనిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. 5,6,7,8 వార్డులలో దాదాపు వందల సంఖ్యలో పందులను 60 మంది సిబ్బంది ఒక తుపాకీ షూటర్, 10 వాహనాలతో మంగళవారం కార్యక్రమం చేపట్టామని. ఇకపై కూడా పందుల నిర్మూలన చేపడతామని, వీటిపై ప్రజల నుండి వరుస పిర్యాదులు, మీడియా లో వరుస కథనాలు, రావటం వీటివల్ల మధుమేహ వ్యాది వచ్చే అవకాశం ఉందని కావున పందుల నిర్మూలన కార్యక్రమం చేపట్టామని డాక్టర్ కిషోర్ తెలిపారు.