పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రం అంటున్న నూతన దర్శకుడు వై ఆర్ చౌదరి
క్యాపిటల్ వాయిస్, సినిమా సమాచారం :- సినిమా మీద ఉన్న మక్కువతో దర్శకత్వం వహిస్తున్నాను, అందుకే తొలి చిత్రం తోనే పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయడానికి నిర్ణయం తీసుకొని పక్కా ప్రణాళికతో కథను సిద్ధం చేసుకున్నాను అని డైరెక్టర్ వై ఆర్ చౌదరి తెలిపారు. సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా పక్క మాస్ అండ్ యాక్షన్ సినిమా అంటున్నారు . ఈ చిత్రం లో కొంత భాగం లవ్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు అన్ని వయసుల వారికీ వారి వారి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చేలా అందరికీ ఆలోచింప చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని డైరెక్టర్ వై ఆర్ చౌదరి తెలిపారు. అలానే ఈ చిత్రం లో నటిస్తున్న నటి నటులకు టెక్నిషన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ మంచి పవర్ ఫుల్ కథ బలం వున్న సినిమా ఇది. కథను బట్టి మొదటగా పెద్ద హీరోలను కలిసి రాంచరణ్, జూనియర్ యాన్. టి. ఆర్. రవితేజ. వీలు అయితేనే సినిమా కథకు సరిపోతారు అనుకున్నాను. కానీ వారు చాలా బిజిగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. ఇది నా తొలి చిత్రం కాబట్టి స్క్రిప్ట్ ప్రకారం నటీ నటులను సెలెక్ట్ చేసుకుని ఈ సినిమాని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ చిత్రం అన్ని వయసులో వారికి అన్ని రాష్ట్రాల వారికీ ఉపయోగపడేలా ఉంటుందని అందుకే మొదటి సినిమా కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, తొందరపడకుండా అనుకున్న విధంగా బాగా రావాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు డైరెక్టర్ వై ఆర్ చౌదరి తెలిపారు. ఈ చిత్రం ఇప్పటికే తెలంగాణ లో పలు ప్రదేశాల్లో 50% పూర్తి చేశామని మిగతా షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్, గోవాలో పూర్తి చేసుకొని 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ చిత్రంలో సిద్దార్థ్ హీరోగా తేజస్విని హీరొయిన్ గా నటిస్తున్నారని దర్శకుడు వై ఆర్ చౌదరి తెలిపారు. సాంకేతిక నిపుణులు బ్యానర్: సూపర్ గుడ్ ఫిలిం ఆర్ట్ క్రియేషన్స్ , ఈ చిత్రానికి కో-డైరెక్టర్: మీసాల రామకృష్ణ, ఫైట్ మాస్టర్: ఆర్ కె, కెమెరా మాన్: నందు ప్రసాద్, పాటలు: వెంకట్ అడ్డాల, కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం :వై ఆర్ చౌదరి.