పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల సమయం వచ్చేసింది. రేపట్నించి అంటే మార్చ్ 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు ఇప్పటికే విడుదల కాగా, తాజాగా పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే…
ఏపీలో పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 18 వరకూ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 3 నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8న ఇంగ్లీషు, ఏప్రిల్ 10న మేథ్స్, ఏప్రిల్ 13న సైన్స్, ఏప్రిల్ 15న సోషల్ సైన్సెస్, ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్ష జరగనుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముందుగా https://bse.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి, ఇందులో ఎస్ఎస్‌సి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేస్తే ఆప్షన్స్ కన్పిస్తాయి. ఇందులో రెగ్యులర్ లేదా వొకేషనల్ వివరాలు సమర్పించాలి. ఆ తరువాత జిల్లా పేరు, స్కూల్ పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరోవైపు ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్ధులు ఎస్ఎస్‌సి, రెండవ సంవత్సరం విద్యార్ధులైతే మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లలో ఫోటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు.