పాలవలస ఎంపీటీసీ ఎలక్షన్ పై జనసేన కలెక్టర్ కి ఫిర్యాదు

పాలవలస ఎంపీటీసీ ఎలక్షన్ పై జనసేన కలెక్టర్ కి ఫిర్యాదు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పాలవలస ఎంపీటీసీ సెగ్మెంట్లో జనసేన అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి 9 ఓట్లు మెజారిటీ అని చెప్తున్నారు. రీకౌంటింగ్ కొరకు డిమాండ్ చేయడంతో ఇప్పుడు మెజారిటీ 18 ఓట్లు, రీ కౌంటింగ్ కుదరదు అని జనసేన పార్టీ అభ్యర్థిని, ఏజెంట్లను బయటికి తోసేసిన అధికారులు. ఈ విషయం పై నాదెండ్ల మనోహర్ , శివ శంకర్ మరియు లీగల్ సెల్ వైజాగ్ జిల్లా ఇంచార్జి రేవతీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనిపై ఈరోజు భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల , ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్, అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ , జనసేన పార్టీ లీగల్ సెల్ వైజాగ్ ప్రెసిడెంట్ రేవతీ , ఎంపీటీసీ అభ్యర్థి తమ్మిన చిన్న అమ్ములు, అప్పల రాజు, జిల్లా నాయకులు కృష్ణయ్య , భీమిలి నాయకులు శ్రీను బాబు మరియు భీమిలి జనసేన పార్టీ జనసైనికులు అనీల్ యాదవ్, ఆనంద్, మల్లేష్ పాల్గొన్నారు.