Andhra PradeshNellore

నువ్వు బతికే ఉన్నావని గ్యారెంటీ ఏంటీ ? అధికారులు ప్రశ్నతో అవాక్కయిన వృద్ధుడు

నువ్వు బతికే ఉన్నావని గ్యారెంటీ ఏంటీ ? అధికారులు ప్రశ్నతో అవాక్కయిన వృద్ధుడు

సామాన్యులకు అంతుపట్టని రెవిన్యూ లీలలు
ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా మార్పు శూన్యం
క్యాపిటల్ వాయిస్, (నెల్లూరు జిల్లా) మర్రిపాడు :- వృద్ధాప్యంలో పొలం పనులు పక్కనపెట్టి….ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ అన్నదాత తను బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పేరు కమల్ సాహెబ్ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పెగళ్లపాడు కి చెందిన కమల్ సాహెబ్ తన తమ్ముడు హుస్సేన్ సాహెబ్ తో కలిసి ఉంటున్నాడు. ఎకరం పొలం ఉండగా ఆ భూమిని ఇద్దరు పంచుకునేందుకు రెండేళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో ఓ వీఆర్వో సహాయంతో తన అన్న కమల్ సాహెబ్ మరణించాడని డాక్యుమెంట్లలో నమోదు చేయించారు హుస్సేన్ సాహెబ్. ఈ విషయం తెలుసుకున్న కమల్ సాహెబ్..తన పేరు మీదున్న ఎకరం పొలం తీసేసుకునేందుకు బతికుండగానే చనిపోయాడని సొంత తమ్ముడు రికార్డులు సృష్టించాడని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ప్రాణాలతో తిరుగుతుంటే చనిపోయానని ఎలా రికార్డుల్లో మార్చారని ఆ వృద్ధుడు అధికారులను నిలదీస్తున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!