AnanthapurAndhra Pradesh
ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
క్యాపిటల్ వాయిస్, (అనంతపురం జిల్లా) కదిరి అర్బన్ :- కదిరి పట్టణం లో స్వర్గీయ నందమూరి తారకరామారావు 26 వర్ధంతి సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనే రక్తదాన శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగుజాతి తనాన్ని దేశం మొత్తం రాష్ట్రం వైపు తిరిగి చూసేలా చేసిన ఘనుడు మహానుభావుడు ఒక నందమూరి తారక రామారావు అన్నారు. తన రాజకీయ ప్రవేశంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు నుండి తన జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాంటి వ్యక్తికి భారతరత్న అవార్డును బాహుకరించదగ శక్తి ఎన్టీఆర్ అని తెలియజేశారు. రక్తదానం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలకు అలాగే పట్టణ వాసులకు పార్టీ కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు సానుభూతిపరులు, విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.