Telangana

నిజామాబాద్ చిన్నారి ఆచూకీ లభ్యం…మహారాష్ట్రలో పాపను వదిలివెళ్లిన కిడ్నాపర్లు

నిజామాబాద్ చిన్నారి ఆచూకీ లభ్యం…మహారాష్ట్రలో పాపను వదిలివెళ్లిన కిడ్నాపర్లు

క్యాపిటల్ వాయిస్, తెలంగాణ :- నిజామాబాద్ లో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. మహారాష్ట్రలోని పాపను కిడ్నాపర్లు వదిలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు.తెలంగాణ నిజామాబాద్‌లో కిడ్నాప్ గురైన మూడేళ్ల చిన్నారి అస్ కియా ఆచూకీ దొరికింది. మహారాష్ట్ర నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు చిన్నారిని వదిలిపెట్టి వెళ్లారు. పోలీసులు పాపను నిజామాబాద్ తీసుకోస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సాయంతో కిడ్నాప్‌ మిస్టరీని ఛేదించారు తెలంగాణ పోలీసులు. శుక్రవారం నిజామాబాద్​ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని పాప తల్లింద్రులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మూడు రోజులకు పాప ఆచూకీ లభ్యం అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టగా… కిడ్నాపర్లు మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు గుర్తించారు.

బుర్ఖాలో వచ్చిన మహిళ..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరేన్‌ తన తల్లి, మూడేళ్ల కూతురు అస్ కియాతో కలిసి శుక్రవారం నిజామాబాద్‌ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు వచ్చారు. కుటుంబసభ్యులు షాపింగ్‌ పూర్తిచేసుకుని బిల్లు చెల్లిస్తున్న సమయంలో చిన్నారి అస్‌కియా కనిపించలేదు. తన కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తల్లి షాపింగ్‌మాల్‌ సిబ్బందికి విషయాన్ని తెలిపింది. దీంతో వాళ్లంతా షాపింగ్ మాల్ వెతికారు. ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారమివ్వడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ టీవీ దృశ్యాల్లో మహిళ బుర్ఖాలో వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. చిన్నారి గాలింపు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. చిన్నారి కిడ్నాప్ అయ్యి రెండు రోజులు గడిచిపోయిన ఆచూకీ లభించలేదు. ఈ కేసులో నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు వేగవంతం చేశారు. జిల్లా సరిహద్దులు, చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా గాలించారు. అప్పటికీ చిన్నారికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలివెళ్లినట్లు స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: