Andhra PradeshVisakhapatnam

నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు.

నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :భీమిలి ప్రతినిధి

1)ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు ?
2) మూడు జనవరిలు పోయినా ఒక్కజాబ్ ఇవ్వలేదు?
3) ఏటా మెగా డీఎస్సీ అన్నారు.. దాన్ని ఊసేఎత్తలేదు..
4) కొర్రయి తేజ ఆశిష్ ( తెలుగుయువత ఆర్గనైజింగ్ సెక్రటరీ భీమిలి నియోజకవర్గం)

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవని ప్రతియేటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని భీమిలి నియోజకవర్గం తెలుగుయువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొర్రయి తేజ ఆశిష్ అన్నారు.తన పాలనలో మూడు జనవరినెలలు పోయిన ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా..10వేలు ఉద్యోగాలతో ఫేక్ క్యాలండర్ ప్రకటించి, నిరుద్యోగులు, యువత ఆశులు నీరుగార్చారని కొర్రయి తేజ ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం అయిన భీమిలి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ. పాదయాత్ర సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతియేటా జాబ్ క్యాలెండర్ హామీతో పాటు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీ కూడా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నెరవేర్చలేదు. యువతను మోసగిస్తూ ఫేక్ క్యాలెండర్ విడుదల చేశారు. దానిపై రాష్ట్రంలో ఉన్న యువతీయువకులు ప్రభుత్వ పాలన పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత టిడిపి ఐదేళ్ల పాలనలో యువతకు డీఎస్సీ కేవలం 17వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి, తాము అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలకు మెగాడీఎస్సీ నిర్వహిస్తానన్నాడు. మూడేళ్ల పాలన పూర్తయినా కూడా జగన్ రెడ్డి ఒక్క డీఎస్సీని,ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేక పోయారు. రాష్ట్రంలో 14వేలకు పైగా పోలీస్ ఖాళీలు ఉంటే, వాటిబర్తి గురించి కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. హోమ్ మంత్రి సుచరిత కూడా పోలీస్ శాఖలో ఉన్న భర్తీచేస్తామన్నారు. రాష్ట్రంలో 14లక్షలమంది యువతీ యువకులు పోలీస్ శాఖ కోసం శిక్షణ పొందుతున్నారు. ఆఖరికి కరోనా సమయంలో కూడా లక్షలరూపాయలు వేయించి శిక్షణలు పొందుతూనే ఉన్నారు. రాష్ట్రంలో యువతీ యువకులను ఉద్యోగాల పేరితో ముఖ్యమంత్రి మాయమాటలతో వంచిస్తున్నారు. టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ చెప్పారు. వాటితో పాటు దాదాపు13లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యేలాచేసిన చంద్రబాబు గారు, వాటిద్వారా 34లక్షల ఉద్యోగం వచ్చేలా ప్రణాళిక సిద్ధంచేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి తరలిపోవడం. ఉద్యోగాలు అంటే ఈ ముఖ్యమంత్రి తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ జాబులు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు, నోటిఫికేషన్ పేరుతో యువతను మోసగించి దాన్ని వారి ప్రతినిధిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాo. జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మూడేళ్లు ఎదురు చూశామని. కానీ ముఖ్యమంత్రి చేసిన మోసంతో ఆయనను నమ్మలేమని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి ఇదే తీరున కొనసాగిస్తే యువతీ యువకులు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!