నింగికెగిసిన ధ్రువతార……..సినీ నటుడు,సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత

నింగికెగిసిన ధ్రువతార……..సినీ నటుడు,సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
క్యాపిటల్ వాయిస్, తెలంగాణ :- సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ 1942 మే 31 గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964 కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964 – 65 లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం నాలుగు దశాబ్దాలకు పైగా సాగింది. సినీ కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు.నటుడు, దర్శకుడు, నిర్మాతగా కృష్ణ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందారు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ.. 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు.తన మూడవ సినిమా గూఢచారి 116 తో పరిశ్రమలో కృష్ణ నిలదొక్కుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో కృష్ణ నటించారు. పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెల కొల్పారు. అంతేకాదు 16 సినిమాలు కృష్ణ డైరెక్ట్ చేశారు.మొదటి సినిమా తేనె మనసులు కాగా.. చివరి సినిమా శ్రీ శ్రీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి సినిమాస్కోప్ చిత్రం – అల్లూరి సీతారామ రాజు (1974), మొదటి ఈస్ట్‌మన్‌కలర్ చిత్రం – ఈనాడు (1982), మొదటి డి టి ఎస్ , 70ఎంఎం చిత్రం – సింహాసనం (1986), అనేక సాంకేతిక రంగాలలో మొదటి చిత్రాలను నిర్మించిన ఘనత కృష్ణకి దక్కుతుంది.పండంటి కాపురం,, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన కేరీర్‌లో ఉన్నాయి. 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు చేశారు. రోజుకు మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు కృష్ణ.2009లో పద్మ భూషణ్‌తో భారత ప్రభుత్వం కృష్ణను సత్కరించింది. 1989లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యునిగా ఏలూరు నుంచి ఎన్నిక అయ్యారు. అలాగే 2008లో ఆంధ్రా యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. బీఏ . చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు.కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి.. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి.