న్యూ లైఫ్ ఫెయిత్ జోయెల్ చర్చి వారి క్రిస్టమస్ మహోత్సవం.

న్యూ లైఫ్ ఫెయిత్ జోయెల్ చర్చి వారి క్రిస్టమస్ మహోత్సవం.
క్యాపిటల్ వాయిస్ : మధురవాడ ప్రతినిధి
మధురవాడ. విశాఖపట్నం జిల్లా మధురవాడ బుధవారం నాడు రాజీవ్ గృహ కల్ప కోలని ,మారికవలస నందు న్యూ లైఫ్ ఫెయిత్ జొయెల్ ట్రస్ట్ అండ్ మినిస్ట్రీ అధినేత బ్రదర్.హనోక్ (మహేష్))గ్రాండ్ క్రిస్టమస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వాక్య సందేసన్ని డా!! పి.చక్రవర్తి ఇచ్చారు. ఇరు పక్కల ఉన్న ప్రజలందరు పాల్గొని ఈ సభలో సంతోషించారు ఇందులో భాగంగా ప్రార్థన ల తోనూ పాటల తోనూ చిన్న పిల్లల కిట్స్ తో డాన్స్ ల తోనూ సందడిగా క్రిస్టమస్ మహోత్సవం జరిపించారు ఇ సందర్భంలో అనేకమంది దేవుని సేవకులకు వస్త్రములు మరియు స్త్రీలకు చీరలు మరియు వృద్ధులకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పీఎం పాలెం పోలీస్టేషన్ సి ఐ రవికుమార్ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ ఫెయిత్ జోయెల్ మినిస్త్రి ఫౌండర్ &ప్రెసిడెంట్ బ్రదర్.హనోక్ (మహేష్ మరియు సెక్రెటరీ కే రాజేష్ మరియు జాన్ సన్ ,ఎం యేసుపాదం మరియు స్థానిక సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.