నంద్యాల లో రౌడి షీటర్ దారుణహత్య…?
నంద్యాల లో రౌడి షీటర్ దారుణహత్య…?
క్యాపిటల్ వాయిస్, (కర్నూలు జిల్లా) నంద్యాల :-వరుస హత్యలతో నంద్యాల వణికిపోతోంది. తిరివీధి వెంకటసుబ్బయ్య హత్య ఘటన మరువకముందే శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. నంద్యాల వెంకటాచలం కాలనీలో రౌడీషీటర్ నాగ త్రిలోచన అలియాస్ బన్నుగాడు (30) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. నంద్యాల దేవనగర్‌కు చెందిన కృపవరం, వెంకటలక్ష్మి దంపతుల కొడుకు నాగ త్రిలోచనకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. నాగ త్రిలోచన ప్రవర్తన భార్యకు నచ్చకపోవడంతో వివాహమైన రెండేళ్లకే విడిపోయారు. ఈ నేపథ్యంలో విశ్వనగర్‌కు చెందిన ఓ వివాహితతో నాగ త్రిలోచనకు పరిచయం ఏర్పడింది. పదేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు. వెంకటాచలం కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నాగ త్రిలోచన ఉంటున్నాడు. శనివారం ఆ ఇంట్లోనే హత్యకు గురికావడం కలకలం రేపింది. డీఎస్పీ చిదానందరెడ్డి, త్రీ టౌన్ సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ తిరుపాలు, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. హత్య చేసినట్లుగా భావిస్తున్న అనుమానితుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం…!!_