Andhra PradeshNellore
నాడు – నేడు నిధులున్నా ….ఓగూరు వాండ్లపల్లి పాఠశాల పరిస్థితి నాడు అంతే నేడు ఇంతే !

నాడు – నేడు నిధులున్నా ….ఓగూరు వాండ్లపల్లి పాఠశాల పరిస్థితి నాడు అంతే నేడు ఇంతే !
క్యాపిటల్ వాయిస్, (నెల్లూరు జిల్లా) :- రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాలల్లో రూపు రేఖలు మార్చింది. కానీ ఈ పాఠశాల కాంపౌండ్ లోపల మాత్రం అప్పుడు ఇప్పుడు ఇలాగే ఉంది. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించారా లేక నీటి పొదుపు కోసం నీటి కొలను నిర్మించారా అని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పాఠశాల సముదాయంలో 130 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక 30 మంది, ఉన్నత పాఠశాల వందమంది, వీరికి ఏడు మంది ఉపాధ్యాయులు, వీరందరూ నీటిలో నడుచుకుంటూ బడిలోకి వెళ్లే పరిస్థితి. కానీ వర్షం వచ్చిందంటే విద్యార్థినీ విద్యార్థులు స్కూల్ గేట్ వద్ద నుంచి క్లాస్ రూమ్ కు వెళ్లే వరకు నీటిలో నుంచి పోవాల్సిందే. కానీ నాడు నేడు పథకంలో నిధులు మంజూరు అయిన పనులు సరిగ్గా చేయించుకో లేకపోవటం విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాల ప్రహరీకి మరమ్మతులు చేసుకున్నారు కానీ సమస్య గుర్తించి లెవలింగ్ చేసుకోలేకపోయారు. నీటిలో పిల్లలు నడిచి వెళ్లడం సాధారణ విషయం ఎంతమాత్రం కాదు. విద్యార్థులు పొరపాటున జారి పడితే ప్రాణాలకే ప్రమాదం అంటూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సంబంధించిన అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన స్కూల్ కాంపౌండ్ లోపల లెవలింగ్ పనులు చేపట్టాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.