నా భూముల విషయంలో వైఎస్ఆర్సిపి పార్టీ వారికి ఎలాంటి సంబంధం లేదు – జడ్జి భార్య ఉషారాణి.

నా భూముల విషయంలో వైఎస్ఆర్సిపి పార్టీ వారికి ఎలాంటి సంబంధం లేదు – జడ్జి భార్య ఉషారాణి
క్యాపిటల్ వాయిస్ (కృష్ణాజిల్లా) పెడన :- ఇటీవల కాలంలో జడ్జి భార్య ఉషారాణి ఆస్తి తగాదాల నేపథ్యంలో పెడన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేను తెలుగుదేశం పార్టీ ఆడపడుచుని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుచరురాలిని అని ఆమె పేర్కొన్నారు. పచ్చ మీడియా తప్పుడు వార్తలతో తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని జడ్జి పడమట తిరుమల రావు భార్య ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు.తెలుగుదేశం మరియు జనసేన పార్టీకి చెందిన ప్రబుద్ధులు మహిళలు అని చూడకుండా తన పట్ల హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని ఆమె ఆరోపించారు.తన భర్తతో కలిసి సంపాదించిన ఆస్తి విషయంలో తమకు మా అత్త వెంకటసుబ్బమ్మకు ఆస్తి గొడవలు ఉన్నాయని తనపై హత్యాయత్నం కూడా చేశారని వీటి పూర్వపరాలు కృష్ణాజిల్లా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని చెప్పారు.గత సాయంత్రంలో ఆమె పెడన లో విలేకరులు సమావేశంలో మాట్లాడారు.మంత్రి జోగి రమేష్ ఆయన అనుచరుడు డొకోమో సాంబశివరావు తమ పొలాన్ని కబ్జా చేశారని ధాన్యం బలవంతుగా ఎత్తుకెళ్లారనే విష రాతల్లో వాస్తవం లేదని ఆమె తీవ్రంగా ఖండించారు.తన భూమి విషయంలో మంత్రి జోగి రమేష్ ఆయన అనుచరుడు సాంబశివరావు కి ఏమి సంబంధం లేదన్నారు.తాను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారని ఆమె తెలిపారు.తన భర్త జడ్జి తిరుమల రావు కోవిడ్ తో చనిపోయారని ఆ సమయంలో తమ దగ్గర ఉన్న కోటి రూపాయలతో పాటు బంగారు నగలు, కార్, ఆస్తుల డాక్యుమెంట్లు కూడా మా అత్తగారు తీసేసుకున్నారని ఆమె తెలిపారు.ఆ తర్వాత రొయ్యూరు ఉన్న తన పొలం చెరుకు వేసేమని చెరుకు పంట కోత సమయంలో ఈ ఏడాది జనవరిలో నాపై హత్యాయత్నం జరిగిందని వివరించారు దీనికి సంబంధించి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని అని చెప్పారు.పెడన మండలం కొంకేపూడి పంచాయతీ ఈదుమూడి గ్రామంలో ఉన్న పొలాన్ని కౌలుకి ఇచ్చామని వివరించారు.నా భర్త ఉన్నప్పుడు నుంచి లుక్కా నాగేశ్వరరావు అనే వ్యక్తి 1 ఎకరం 30 సెంట్లు కౌలు చేస్తున్నాడని, ఆ పొలం ఆయన పేరు మీదే ఉందని,ఇప్పుడు ఆ పొలాన్ని పామర్తి అర్జున రావు అని వ్యక్తికి లుక్కా నాగేశ్వరావు విక్రయించడం తెలిపారు.నాకు చెందిన పొలం డాక్యుమెంట్లు, కౌలుదారు పత్రాలు మా అత్త తరుపు వ్యక్తులు నకిలీవి సృష్టించారని, వీటి పైన ఈ నెల 4 న, 8వ తేదీన మరియు మూడు రోజుల కింద కూడా పెడన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.