International

ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ మరికొంత మందికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ మరికొంత మందికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

క్యాపిటల్ వాయిస్, జాతీయం :- ముంబయి రేవ్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్ తోపాటు మరికొంత మందిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. తమ కస్టడీకి ఇవ్వాలని కోరిన ఎన్సీబీ అభ్యర్థనను తిరస్కరించింది.ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, మునుమున్ థమేచా, అర్బాజ్ సేథ్ మర్చంట్ తోపాటు మరో ఆరుగురిని ముంబయి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్‌ఎమ్ నెర్లికర్ మాట్లాడుతూ ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు ఈ కేసును విచారిస్తుందని చెప్పారు.ఎన్‌సీబీ న్యాయవాదులు, నిందితుల తరఫు న్యాయవాదుల మధ్య వాదనలు విన్న కోర్టు.. మరికొన్ని రోజులపాటు ఆర్యన్ ఖాన్ తోపాటు మరికొంత మందిని ఎన్సీబీ కస్టడీకి ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఎన్సీబీకి విచారణకు తగినంత సమయం, అవకాశం ఇచ్చినందున కస్టడీ విచారణ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కారణంగా వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. శుక్రవారం నిందితుల తరఫు న్యాయవాది.. బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఏం జరిగిందంటే..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు. విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. సోమవారం అతడిని ముంబయి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతకు ముందే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతూ ఆర్యన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్యన్‌కు బెయిల్‌ను నిరాకరించిన న్యాయస్థానం.. అతనికి ఈ నెల 7వ తేదీ వరకూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!