AnanthapurAndhra Pradesh
ఎంపీటీసీ గా జనసైనికుడు ప్రమాణ స్వీకారం…… రాయలసీమకు జన సైనికుడు ఓక్కడే
ఎంపీటీసీ గా జనసైనికుడు ప్రమాణ స్వీకారం…… రాయలసీమకు జన సైనికుడు ఓక్కడే
క్యాపిటల్ వాయిస్(అనంతపురం జిల్లా) తనకల్లు:- మండల పరిధిలో ఇటీవల జరిగిన జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో రాయలసీమ వ్యాప్తంగా ఉన్న జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు గాను జనసేన పార్టీ తరఫున అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాలసముద్రం ఎంపీటీసీ స్థానాన్ని జనసేన పార్టీ అభ్యర్థి అమర్ కార్తికేయ విజయం సాధించి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో బాలసముద్రం మినహా ఏ ఒక్క స్థానాన్ని కూడా జనసేన పార్టీ కైవసం చేసుకోలేకపోయింది.దీంతో మొట్టమొదటిసారిగా రాయలసీమ వ్యాప్తంగా జనసేన తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచి రికార్డు సృష్టించాడు.ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ కార్తికేయ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం ప్రజల కష్టసుఖాలు పంచుకోవడం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నాకు జనసేన పార్టీలో అవకాశం ఇచ్చి రాజకీయ ఓనమాలు దిద్దించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. కదిరి నియోజకవర్గ ఇన్చార్జి భైరవ ప్రసాద్ ,మండల స్థాయి నాయకులకు, కార్యకర్తలకు , బాలసముద్రం గ్రామ ప్రజలకు ధన్యవాదాలుతెలియజేశారు. నా మీద నమ్మకంతో నా గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ తోడుగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూజనసేన పార్టీ బలోపేతానికి పాటుపడతానని తెలియజేశారు.
