Andhra PradeshGuntur
మొక్కలను సంరక్షించండి……ప్రకృతిలో మమేకం కండి : ప్రకృతి ప్రేమికుడు కొమెర జాజి

మొక్కలను సంరక్షించండి……ప్రకృతిలో మమేకం కండి : ప్రకృతి ప్రేమికుడు కొమెర జాజి
నల్లమల అడవి ప్రాంతం గుమ్మనంపాడు హైస్కూలు లో 500 మంది విద్యార్థులకు ప్రకృతి సంరక్షణ పాఠాలు
క్యాపిటల్ వాయిస్, గుంటూరు జిల్లా, కారంపూడి :- మొక్కలు కూడా ఒక రకమైన ప్రాణి జాతి లాంటివని అందుకే వాటిని ప్రకుతిలో మమేకమై చిన్న పిల్లలవలె చూసుకోవాలని కొమెర జాజి వివరించారు.ప్రకృతి పాఠశాల కార్యక్రమంలో భాగంగా శనివారం గుమ్మనంపాడు గ్రామం బొల్లాపల్లి మండలం గుంటూరు జిల్లా.ప్రకృతి లో ఉన్న వన మూలికలు వాటి ఉపయోగముల గురించి మూలికా సేకరణ నిపుణుడు , ప్రకృతి సంరక్షణ సేవా సంస్థ & ప్రకృతి ఆశ్రమం నిర్వాహకుడు కొమెర జాజి సోదాహరంగా తనదైన శైలిలో వివరించారు.ఈ విశ్వంలో అనంతకోటి ప్రాణుల తో పాటు మనకు తోడుగా ఉంటూ మన ఆరోగ్యాలను నిరంతరం కాపాడే వృక్షరాజాలను మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనపై ఉన్నదని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ సందర్భంలో మనం విరివిగా మొక్కలు నాటి మన వంతు పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని, ఈ విద్యార్థి దశలో మనం నేర్చుకోవాల్సిన అంశాలతో పాటు ప్రకృతి వాపి దృష్టి సారించాల్సిన భాద్యత విద్యార్ధులపై ఉన్నదని అయన హితవు పలికారు. ప్రకృతిని ప్రేమిస్తే మనల్ని మనం ప్రేమించుకున్నట్లేనని అయన వివరించారు.ఇప్పటికైనా అందరు ప్రకృతి పై దృష్టి మరల్చి మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత కు కృషి చేయాలనీ వారు అన్నారు. ఇప్పటికే అనావృష్టి, అతివృష్టి పరిస్థితులతో చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మనం అలానే చూస్తున్నాం తప్ప ఏమి చేయలేకపోతున్నాం అని అయన ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 ఒక లక్ష మంది విద్యార్థులకు ,ప్రతిఒక్కరికి కూడా ప్రకృతి గురించి వాటి ఉపయోగములు, వన మూలికలు మనకి ఎలా మేలు చేస్తాయి చెప్పి , సుమారుగా కోటి మొక్కలు నాటించడమే, ప్రకృతి పాఠశాల యొక్క ఉద్దేశం అని తెలుపుతూ,ఇప్పటికైనా మించి పోయింది లేదని, అందరు తలా ఒక చెయ్యి వేసి పర్యావరణ హితానికి దోహదం చేద్దాం అని ఆశాభావం వ్యక్తం చేసారు.ఎవరికైనా మొక్కలు నాటాలి అని ఉన్న, సమయాభావం వలన కుదరకపోతే వారు మాకు విత్తనాలు కానీ, లేక మొక్కలు కానీ మాకు పంపినట్లయితే మేము మాకు దగ్గరలో ఉన్న ప్రకృతి వనాల్లో, అడవుల్లో ఈ మొక్కలు నాటతామని అయన వివరించారు. ఈ నెంబరును సంప్రదించగలరని అయన తెలిపారు.కొమెర జాజి ( ప్రకృతి మూలికా సేకరణ నిపుణుడు ) village life journey youtube chanel, సెల్ : 9908411700