Andhra PradeshWest godavari
మొగల్తూరు:పేరుపాలెం బీచ్ లో 4వ ఆదివారం జనాల సందడి చేశారు.

మొగల్తూరు:పేరుపాలెం బీచ్ లో 4వ ఆదివారం జనాల సందడి చేశారు.
క్యాపిటల్ వాయిస్ :పట్చిమ గోదావరి :మొగల్తూరు ప్రతినిధి
మొగల్తూరు:పేరుపాలెం బీచ్ లో 4వ ఆదివారం జనాల సందడి చేశారు.కార్తీకమాసం సందర్భంగా బీచ్ కు వివిధ జిల్లాల నుండి భారీగా జనాలు వచ్చారు. నాలుగవ ఆదివారం కావడం వలన పెద్ద ఎత్తున జనాలు వచ్చి సముద్రంలో స్నానాలు చేసి సంతోషంగా పిల్లలు పెద్దలు కేరింతలు కొట్టారు.కొబ్బరి తోట లో కుటుంబ సమేతంగా సహపంక్తి వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పి పి. వీరంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో మొగల్తూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆకతాయిలు ఆట కట్టించి జనాలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.