NTR JILLA

ఎమ్మెల్యే టికెట్ రేసులోకి మల్లెల కుటుంబం..!?

ఎమ్మెల్యే టికెట్ రేసులోకి మల్లెల కుటుంబం..!?
ప్రత్యక్ష రాజకీయాలలోకి మల్లెల ఇంటి కోడలు…!?
పార్టీ ఆదేశిస్తే మైలవరం టిడిపి నుండి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ…!!
పోటీ చేసి గెలిస్తే మైలవరం గడ్డ పై తొలి మహిళా ఎమ్మెల్యే గా చరిత్ర…!!
సార్వత్రికం లో స్థానికత అనివార్య మైతే మల్లెల కుటుంబం అన్ని విధాలుగా అర్హత….!!
మల్లెల కుటుంబ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసొచ్చే అవకాశం…!!
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తో మల్లెల కుటుంబానికి సన్నిహిత సంబంధం….!!
నారా భువనేశ్వరి అడుగులో అడుగు వేసేందుకు సన్నాహాలు..!!
క్యాపిటల్ వాయిస్, ఎన్టీఆర్ జిల్లా,మైలవరం:- సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న కొద్ది ఎమ్మెల్యే అభ్యర్థుల పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టిడిపి తరుపున 2024 ఎన్నికలలో పోటీలో నిలిచే అభ్యర్థుల పై ఇప్పటివరకు ఆయ పార్టీల అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడం తో ఎవరికి వారు తమే అభ్యర్థులం అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై అటు అధికార పార్టీ లోనూ ఇటు ప్రతిపక్ష టిడిపి లో కూడా అనేక పేర్లు తెర మీదకు వచ్చాయి. అంతేకాకుండా వారే ఆ పార్టీ అభ్యర్థులు అంటూ విస్తృత ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం అధికార వైసీపీ లో కంటే టీడిపి లోనే ఎక్కువ జరుగుతోందనీ చెప్పాలి. మైలవరం నియోజకవర్గం టిడిపి నుండి ఎమ్మెల్యే  అభ్యర్థులు వీరే అంటూ అనేక కథనాలు వచ్చాయి. ఆ కథనాలకు బలం చేకూరే విధంగా మైలవరం టిడిపి లో అనేక మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. మైలవరం టిడిపి లో ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తో పాటు బొమ్మసాని సుబ్బారావు,  గన్నే ప్రసాద్ పేర్లు ప్రచారం లోకి వచ్చాయి. ఈ క్రమం లోనే మైలవరం టిడిపి ఎమ్మెల్యే టికెట్ రేసులోకి  ఇబ్రహీంపట్నం కు చెందిన మల్లెల కుటుంబ సభ్యుల పేరు  ప్రచారం లోకి వచ్చింది. రాజకీయంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దిగవంత నేత ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ మల్లెల అనంత పద్మనాభ రావు కోడలు పేరు ఇప్పుడు చర్చ లోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో మల్లెల ఇంటి కోడలు ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికత నినాదం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పోటీలో లేకపోతే తాము పోటీలో ఉంటామని మల్లెల కుటుంబ సభ్యులు సన్నిహితులతో చెబుతున్నారట. రాజకీయంగా ప్రస్తుతం మల్లెల కుటుంబ సభ్యులు క్రియా శీలకంగా పని చేస్తూ వచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించిన మల్లెల కుటుంబం అమరావతి ఉద్యమం లో కూడా మల్లెల కుటుంబ సభ్యులు భాగస్వామ్యం అయ్యారు.. అయితే ఎప్పుడు కూడా పార్టీ నుండి  పదవి కానీ పోటీ లో  నిలబడేందుకు ఆసక్తి చూపించలేదు..కానీ టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం బాబు కుటుంబ సభ్యులు రొడ్డెక్కడం చూసిన మల్లెల కుటుంబం మళ్ళీ యాక్టిివ్ పాలిటిక్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అందులో భాగంగానే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా టిడిపి తరుపున నిలబడే విధంగా పావులు కదుపుతున్నారట.. దిగవంత నేత అన్న నందమూరి తారక రామారావు కుటుంబం తో నారా చంద్రబాబు కుటుంబం తో మల్లెల కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉండటం కూడా ప్రత్యక్ష రాజకీయాలకు ఒక కారణం గా చెబుతున్నారు. ఇటీవల కాలంలో మైలవరం నియోజకవర్గం లో స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ బలంగా విపిస్తుంది. ఈ నేపథ్యంలో టిడిపి తరుపున మల్లెల కోడలు బరిలో నిలిచేందుకు తెర వెనుక వ్యూహ రచన చేస్తున్నారట.. ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థులు గా అనేక పేర్లు ప్రచారం లో ఉన్న నేపథ్యం లో మరో పేరుగా మల్లెల కుటుంబ సభ్యులు అని ప్రచారం జరగడం తో స్థానికంగా సంచలనం గా మారింది.మల్లెల ఇంటి కోడలు ప్రత్యక్ష రాజకీయాలోకి రావాలి అనుకోవడం లో కూడా అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.. అవేంటి అనేది చూద్దాం…
 *ప్రత్యక్ష రాజకీయాల్లోకి మల్లెల కుటుంబ…!!*
రాష్ట్ర టిడిపి లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహిళా శక్తి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇంటికి పరిమితమైన ఎందరో మహిళా మణులు నారా చంద్రబాబు నాయుడు కు మద్దతుగా రోడ్డు ఎక్కి నినదిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యక్ష రాజకీయాలలో టిడిపి మహిళా శక్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో  మరో మహిళ శక్తి మల్లెల ఇంటి కోడలు  ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మైలవరం గడ్డ పై తొలి మహిళా ఎమ్మెల్యే గా చరిత్ర లిఖించేందుకు వ్యూహ రచన చేస్తున్నారట. మైలవరం ఎమ్మెల్యే గా బరిలో నిలిచేందుకు గతం లో కూడా మల్లెల వారసుడు మల్లెల శ్రీనివాస్ చౌదరి ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా పోటీ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి అనూహ్యంగా మల్లెల ఇంటి కోడలు పోటీ చేస్తారని ప్రచారం జరగడం తో రాజకీయంగా చర్చనీయాంశం గా మారింది. ప్రస్తుతం జరుగుతున్న అత్యవసర పార్లమెంట్ సభలో మహిళ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా కాకుండా ఈ బిల్లు చట్ట సభలో ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది.అంతేకాకుండా మైలవరం నియోజకవర్గ రాజకీయం లో ప్రధాన పార్టీల నుండి ఇప్పటివరకు ఒక మహిళ ఎమ్మెల్యే గా పోటీ చేసిన దాఖలాలు లేవు. అన్నీ అనుకూలించి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా మల్లెల ఇంటి కోడలికి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మైలవరం రాజకీయ చరిత్ర లో తొలి మహిళా ఎమ్మెల్యే గా నూతన అధ్యాయం లిఖించే అవకాశం కూడా ఉంది. జరుగుతున్న ప్రచారం మేరకు ఒక మహిళకు పార్టీలు అవకాశం ఇస్తాయ అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. మైలవరం గడ్డ పై తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చి సంచలనాలు నమోదు చేస్తారా లేక యదా రాజా తథా ప్రజా అన్నట్లు అవకాశాలు కల్పిస్తారా అన్నది తేలాలి అంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!