Andhra PradeshGuntur
మిర్చి తోటలు పీకేసిన రైతులు…..అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో మిరపరైతుల ఆందోళన

మిర్చి తోటలు పీకేసిన రైతులు…..అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో మిరపరైతుల ఆందోళన
క్యాపిటల్ వాయిస్, గుంటురు జిల్లా :- అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో మిరపరైతుల ఆందోళన చేపట్టారు. చింతపల్లి, పెదకూరపాడులో మిరప తోటలు రైతన్నలు పీకేశారు. హైబ్రిడ్ మిరప నాటి అరవైరోజులు దాటినా పూత, పిందెలు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైబ్రిడ్ నాసిరకం విత్తనాలతో పంటలపై లక్షలరూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ ఆరోపణ చేశారు. యు యస్-402 నాసిరకం విత్తనాలు వచ్చాయంటూ వ్యవసాయశాఖ అధికారులకు రైతులు మొరపెట్టుకున్నారు. నష్టపోయిన మిర్చి పంటను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. మిర్చి పంట పూత, పిందె రాకపోవడంపై విచారణ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.