మెంటాడ మండలంను విడగొట్టవద్దు విశాఖలో స్క్రూటినీ కమిటీకి జేఏసీ వినతి.

మెంటాడ మండలంను విడగొట్టవద్దు విశాఖలో స్క్రూటినీ కమిటీకి జేఏసీ వినతి.
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) మెంటాడ.
ప్రజల అవసరం, సౌలభ్యంను
గుర్తించి మెంటాడ మండలాన్ని దగ్గరగా ఉన్న విజయనగరం జిల్లాలోనే
కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి, స్క్రూటినీ
కమిటీ సభ్యుడు విజయ్ కుమార్ కు జేఏసీ నాయకులు వినతిని అందచేశారు. సోమవారం
విశాఖలో కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రజాభిప్రాయ పరిశీలన కమిటీ సమీక్ష
నిర్వహించింది. సమీక్ష ప్రారంభానికి ముందుగానే మెంటాడ మండల జేఏసీ నాయకులు
విశాఖ కలెక్టరేట్ ఎదుట బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు
చేశారు. అది గమనించిన ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వీరికి
అపాయింట్ మెంట్ ఇచ్చారు. దాంతో జేఏసీ అధ్యక్షుడు, ఎంపిపి రెడ్డి సన్యాసి
నాయుడు, వైస్ ఎంపీపీ సారిక ఈశ్వర్ రావు, మండల టీడీపీ అధ్యక్షుడు సిహెచ్
వెంకట్ రావు, సీనియర్ మండల నాయకుడు గెద్ద అన్నవరం, సర్పంచ్ రాయిపల్లి
రామారావు తదితరులు విభజన వల్ల ప్రజలకి ఎదురయ్యే ఇబ్బందులను ఆయనకి
వివరించారు. పార్వతిపురంలో కలుపుతున్న మండలాలన్నీ ఆ రెవెన్యూ డివిజన్ కే
చెందినవని, 40 ఏళ్లుగా విజయనగరం రెవెన్యూ డివిజన్ లో ఉన్న మెంటాడ మండలంను
మాత్రమే కలుపుతున్నారని తెలిపారు. మెంటాడ మండలంలోని గ్రామాలన్నీ విజయనగరం
జిల్లా కేంద్రంకి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా, పార్వతీపురం 90 కిలో
మీటర్ల దూరంలో ఉందని , విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తుతాయని
విజ్ఞప్తి చేసారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విజయ్ కుమార్ ప్రజల
అభ్యంతరాలు సహేతుకంగా ఉంటే, ఆ అంశాలన్నింటిని కూలంకషంగా పరిశీలిస్తామని
స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు రేగిడి
రాంబాబు, లెంక రత్నాకర్ నాయుడు, రాయిపల్లి రామారావు, పాశల ప్రసాద్ రావు,
ఎస్ నారాయణ రావు, సీహెచ్ సన్యాసి నాయుడు, పతివాడ విశ్వేశ్వర రావు, వర్రి
పైడపు నాయుడు తదితరులు పాల్గొన్నారు.