మరో మినీ నయగారమా….పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న పొల్లూరు జలపాతం

మరో మినీ నయగారమా….పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న పొల్లూరు జలపాతం
క్యాపిటల్ వాయిస్, తూర్పు గోదావరి జిల్లా :- తూర్పు గోదావరి జిల్లా ఎటపాకా దివిజాన్ చింతురు మండలం పొల్లూరు జలపాతం వద్దా ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలలో పర్యాటకులు వేల సంఖ్యలో పొల్లూరు జలపాతం వద్ద వచ్చి తమ కుటుంబాలతో స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం పొల్లూరు జలపాతం వద్ద సెల్ఫీ ఫోటోలు తీస్తుండగా పర్యాటకులు నిర్లక్ష్యం వల్ల మరణిస్తున్నారు. పొల్లూరు జలపాతం వద్ద నిషేధిత స్థలంలో నో ఎంట్రీ హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. మోతుగూడెం పొల్లూరు జంక్షన్ పాయింట్ లో హెచ్చరిక నోటీసు బోర్డులు పెట్టాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. పర్యాటకులు మోతుగూడెం పుల్లూరు ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు చూసి పర్యాటకులు జాగ్రత్త వహిస్తారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పొల్లూరు జలపాతం వద్ద అభివృద్ధి చేయాలని , ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తించి పొల్లూరు జలపాతం వద్ద అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. జలపాతం వద్ద వెళ్లడానికి సరైన రహదారి లేక పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. సరైన రహదారి లేక పర్యాటకులు తమ కార్లు బైకులు బస్సులు రోడ్డు పక్కన పార్కింగ్ చేసి కిలోమీటర్లు నడిచి జలపాతం వద్దకు వెళ్లి సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. జలపాతం వద్దకు వెళ్లడానికి రోడ్లు నిర్మించాలని పర్యటకులు కోరుతున్నారు. జలపాతం వద్ద చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.