Andhra PradeshVisakhapatnam

మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆదేశాలతో నూతన రహదారుల నిర్మాణం : వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు.

 మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆదేశాలతో నూతన రహదారుల నిర్మాణం : వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు

క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- జోన్ 2:మధురవాడ జీవీఎంసీ 7 వ వార్డ్ లో గతం లో వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు ప్రతిపాదించిన రహదారులు కృష్ణనగర్, భరత్ నగర్, దుర్గానగర్ ప్రాంతాల్లో 30 లక్షలు రూపాయలు వ్యయం తో నూతనంగా బి టి రహదారులు వెయ్యడం జరిగింది. వేసిన రోడ్ ని ఏ ఈ శ్రీనివాసరావు మరియు జీవీఎంసీ సిబ్బంది క్వాలిటీ చెకింగ్ చేశారు.పోతిన శ్రీనివాసరావు ఆదేశాలమేరకు మహిళానాయకురాలు చేకూరి రజని రోడ్ పనులని పర్యవేక్షించడం జరిగినది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మధురవాడ ప్రాంతం లో ఎన్నో ఏళ్లుగా రహదారులు లేకుండా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం లో ఒక్క రహదారి కూడా వెయ్యలేదు, వైస్సార్సీపీ గవర్నమెంట్ వచ్చాక 7 వ వార్డ్ లో దాదాపు 10 కోట్లుతో అభివృద్ధి పనులులో భాగంగా రహదారులు, డ్రైనేజీలు నిర్మించారని . భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి వాటికి కావలిసిన నిధులను మంజూరు చేయిస్తున్నారు కాబట్టి ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!