మామ ఆస్తిపై అల్లుడికి హక్కు ఉంటుందా ? కేరళ హైకోర్టు కీలక తీర్పు

మామ ఆస్తిపై అల్లుడికి హక్కు ఉంటుందా ? కేరళ హైకోర్టు కీలక తీర్పు
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- కుటుంబం కోసం చర్చి అధికారులు ఆస్తి ఇచ్చారని ఇప్పుడు ఆస్తి యొక్క హక్కు కూడా ప్రశ్నార్థకమవుతుందని అల్లుడు కోర్టులో వాదించాడు.మామ ఆస్తిపై తనకు హక్కు కల్పించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మామ ఆస్తిపై అల్లుడికి ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండబోవని తీర్పు ఇచ్చింది. జస్టిస్ అనిల్ కుమారు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. పయ్యన్నూర్ సబ్ కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా కన్నూర్ తాలిపరంబాకు చెందిన డేవిస్ రాఫెల్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.డేవిస్ తన ఆస్తిలోకి చొరబడకుండా.. దానిని చేసుకోకుండా శాశ్వత నిషేధం విధించాలని కోరుతు అతడి మామ హెండ్రి ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు. సెయింట్ పాల్స్ చర్చి, త్రిచంబరం, ఫ్రమ్ జేమ్స్ నస్రత్ ద్వారా గిఫ్ట్ డీడ్‌గా ఈ ఆస్తిని పొందినట్లు హెండ్రి పేర్కొన్నాడు. ఇందులో తన సొంత నిధులతో కాంక్రీట్ ఇంటిని నిర్మించాడనని అన్నాడు. అప్పటి నుంచి తన కుటుంబంతో అక్కడ నివసిస్తున్నాడు. తన అల్లుడికి ఆస్తిపై ఎలాంటి హక్కు లేదని అతను వాదించాడు.కుటుంబం కోసం చర్చి అధికారులు ఆస్తి ఇచ్చారని.. ఇప్పుడు ఆస్తి యొక్క హక్కు కూడా ప్రశ్నార్థక మవుతుంది అల్లుడు కోర్టులో వాదించాడు. అతను హెండ్రి యొక్క ఏకైక కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత కుటుంబ సభ్యుడిగా మారారని అన్నాడు. అందువల్ల అతను ఇంటిలో నివసించే హక్కు తనకు ఉన్నట్టు వ్యవహరించాడు. అయితే అల్లుడికి ఆస్తిలో ఎలాంటి హక్కు లేదని ట్రయల్ కోర్టు నిర్ధారించింది.ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాల వాదనలు విన్న కేరళ హైకోర్టు.. అల్లుడిని కుటుంబ సభ్యుడిగా గుర్తించడం కష్టమని వ్యాఖ్యానించారు. హెండ్రీ కూతుర్ని పెళ్లి చేసుకున్న తరువాత తాను ఆయన కుటుంబంలో ఒకరిగా డేవిస్ రాపల్ కోరడం సిగ్గుచేటు అని కోర్టు అభిప్రాయపడింది.